న్యూజెర్సీ సెనెటర్ రికార్డు.. ట్రంప్​ను విమర్శిస్తూ 25 గంటల నాన్ స్టాప్ స్పీచ్

న్యూజెర్సీ సెనెటర్ రికార్డు.. ట్రంప్​ను విమర్శిస్తూ 25 గంటల నాన్ స్టాప్ స్పీచ్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ను విమర్శిస్తూ డెమోక్రటిక్ పార్టీకి చెందిన న్యూజెర్సీ సెనేటర్ కోరి బూకర్ నాన్​ స్టాప్​గా 25 గంటల 5 నిమిషాల పాటు స్పీచ్ ఇచ్చారు. సెనేట్​లో అతిపెద్ద స్పీచ్ ఇచ్చిన వ్యక్తిగా బూకర్ చరిత్ర సృష్టించాడు. 

ట్రంప్ అధికారంలోకి వచ్చాక చేపట్టిన ఆర్థిక సంస్కరణలపై తన ప్రసంగం ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్రంప్ పాలసీలు, టారిఫ్​లను కోరి విమర్శించాడు. డిపార్ట్​మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) చేపట్టిన ఉద్యోగాల కోతలు, ప్రభుత్వ సేవల నియంత్రణపై విమర్శలు గుప్పించాడు. కాగా, గత సోమవారం సాయంత్రం 6.59 గంటలకు తన స్పీచ్​ను ప్రారంభించి.. మంగళవారం రాత్రి 8.05 గంటలకు ముగించాడు.