హనుమకొండ సిటీ, వెలుగు: కొత్తగా వస్తోన్న చట్టాలపై, తీర్పులపై న్యాయవాదులు పట్టు సాధించాలని ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. ఆదివారం ఇండియన్ లాయర్స్అసోసియేషన్ ( ఐఏఎల్) ఆధ్వర్యంలో హనుమకొండలో నిర్వహించిన తెలంగాణ రెండో మహాసభలకు ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. కోర్టుల గౌరవాన్ని కాపాడేలా న్యాయవాదులు మెలగాలని, బాధితులకు సకాలంలో న్యాయం అందించాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వరంగల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్మలా వి గీతాంబ, హనుమకొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేష్‌బాబు, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ దుస్సా జనార్దన్, ఐఏఎల్ తెలంగాణ అధ్యక్షుడు పొట్ల మాధవరావు, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ సురేశ్, ఝార్ఖండ్ బార్ కౌన్సిల్ సభ్యుడు రషీద్, వరంగల్, జనగామ, ములుగు జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు పాల్గొన్నారు.