
హైదరాబాద్, వెలుగు:ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (పీటీఏ) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా కె. మల్లికార్జున్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె.శారద ఎన్నికయ్యారు. పీటీఏ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏఐపీటీఎఫ్ జాతీయ కార్యదర్శి వైఎస్ శర్మ మంగళవారం ప్రకటించారు.
స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పి.పార్థసారధి, సీహెచ్ ప్రభాకర్, ఫైనాన్స్ సెక్రటరీగా సీహెచ్ చౌదరి, చీఫ్ ప్యాట్రన్స్ గా కేఎస్ ప్రకాశ్ రావు, జీవీ బద్రినారాయణ, ఉమెన్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా వరలక్ష్మి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రైమరీ స్కూళ్ల బలోపేతానికి, వాటిలో పనిచేసే టీచర్ల ఆత్మగౌరవం కోసం పనిచేస్తామని చెప్పారు. పీఆర్సీని, ఐదు డీఏలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.