కేబీఆర్ పార్క్ వద్ద కొత్త వెలుగులు..డెకరేటివ్ పవర్ పోల్స్ ప్రారంభం..

హైదరాబాద్ లోని కేబీఆర్ పరిసర ప్రాంతాల్లో కొత్త వెలుగులు జిగేల్ మంటున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త డెకరేషన్ పవర్ పోల్స్ ను ఏర్పాటు చేసింది జీహెచ్ ఎంసీ. గురువారం (నవంబర్ 28) సాయంత్రం జీహెచ్ ఎంసీ కమిషనర్ గద్వాల విజయలక్ష్మీ ఈ లైటింగ్ సిస్టమ్ ను ప్రారంభించారు. 

బంజారా హిల్స్  కేబీఆర్ పార్క్ మెయిన్ గేటు నుంచి జూబ్లీ చెక్ పోస్టు వరకు మొత్తం 60 డెకరేటివ్ పవర్ పోల్స్ ను ఏర్పాటు చేశారు. జూబ్లీ చెక్ పోస్టు వద్ద ఈ మ్యూజికల్ ఇన్ స్ట్రుమెంట్స్ లైట్స్ ను అధికారులతో కలిసి ప్రారంభించారు మేయర్ గద్వాల విజయలక్ష్మీ.