వాట్సాప్.. మళ్లీ కొత్త అప్డేట్ తెచ్చేసింది. స్టేటస్‌కు సంబంధించిన అప్డేట్ ఇది. వాట్సాప్‌లో స్టేటస్ అప్లోడ్ చేయడం అందరికీ అలవాటే. అయినప్పటికీ చాలామంది వాటిని చూసేసరికి అది అందులో ఉండకపోవచ్చు. దీంతో కొందరు ప్రత్యేకించి ఎవరికోసమైనా స్టేటస్ పెడితే దాన్ని చూశారో, లేదో అనే ఎగ్జయిట్మెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చిన ఈ ఫీచర్‌తో వాళ్లు తప్పకుండా చూస్తారు. ఎందుకంటే... పెట్టిన స్టేటస్ నోటిఫికేషన్ ఆ పర్సన్‌కు వెళ్లిపోతుంది. అందుకోసం స్టేటస్ పెట్టేటప్పుడే వాళ్ల కాంటాక్ట్ ట్యాగ్ చేస్తే సరి.
అదెలాగంటే..?
వాట్సాప్‌లో స్టేటస్ అప్లోడ్ చేసేటప్పుడు యాడ్ క్యాప్షన్స్ అనే బార్ కనిపిస్తుంది. దానికి కుడివైపున ఇప్పటినుంచి @ అనే ఐకాన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే వాట్సాప్‌లో ఉన్న మీ కాంటాక్ట్స్ లిస్ట్ కనిపిస్తుంది. వాటిలో మీరు ఎవరికి ట్యాగ్ చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకుని మెన్షన్ చేయొచ్చు. మెన్షన్ చేసినవాళ్లకు స్టేటస్ పెట్టినట్లుగా నోటిఫికేషన్ వెళ్తుంది. దీంతో వాళ్లు ఆ స్టేటస్ చూస్తారు.
ఇది అచ్చం ఇన్స్టాగ్రామ్ స్టోరీలు ట్యాగ్ చేసే ఫీచర్లా కనిపిస్తున్నా.. ఒక తేడా ఉంది. అదేంటంటే.. మెన్షన్ చేసిన వ్యక్తి పేరు ఇన్స్టాలోలాగ అందరికీ కనిపించదు. యూజర్ల ప్రైవసీ కోసమే ఈ జాగ్రత్తలు తీసుకుందట వాట్సాప్. ప్రస్తుతం ఈ ఫీచర్ దాదాపుగా యూజర్లందరికీ అందుబాటులో ఉంది. మరింకేం.. ఇక నుంచి స్టేటస్ పెట్టేటప్పుడు మెన్షన్ చేయడం మర్చిపోవద్దు.