కొత్త మిస్అమెరికా ఎవరంటే.. 

పాత మిస్అమెరికా రిజైన్ చేయటంతో కొత్త మిస్ అమెరికాను ఎంపిక చేసింది మిస్ యూనివర్స్ సంస్థ. మానసిక సమస్యలు, వ్యక్తిగత సమస్యల కారణంగా పాత మిస్ అమెరికా నొఇలియా ఓగిట్  రాజీనామా చేయటంతో రన్నరప్ గా ఉన్న సవన్నా గాంకివిచ్ ను ఎంపిక చేశారు. హవాయ్ కి చెందిన 28ఏళ్ళ గాంకివిచ్ మిస్ అమెరికా 2023 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టు వరకు ఈమె ఈ టైటిల్ ని ఎంజాయ్ చేయనుంది.

మావుయి ద్వీపంలో పుట్టి పెరిగిన గాంకోవిచ్ మహిళా సాధికారత కోసం ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ను కూడా నడుపుతున్నట్లు తెలుస్తోంది.మిస్ అమెరికాతో పాటు, మిస్ టీన్ అమెరికా కూడా రాజీనామా చేశారు. 17ఏళ్ళ ఉమా సోఫియా శ్రీవాత్సవ వ్యక్తిగత కారణాల దృష్ట్యా మిస్ టీన్ అమెరికాకు రాజీనామా చేసినట్లు తెలిపింది.