TVS Apache RTR 310: మార్కెట్లోకి టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. లుక్ అదుర్స్..

TVS Apache RTR 310: మార్కెట్లోకి టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. లుక్ అదుర్స్..

అపాచీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న టీవీఎస్ అపాజీ ఆర్టీఆర్ 310 మార్కెట్లోకి వచ్చింది. మూడు రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. ఈ బైక్ అలాయ్ వీల్స్ డిజైన్ ను మార్చారు. మిషెలిన్ రోడ్ 5 రబ్బర్ టైర్స్ ను అమర్చారు. ముందు, వెనక పెటల్ డిస్క్ బ్రేక్స్ తో అందుబాటులో ఉంది.  

ఈ బైక్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ను పూర్తిగా రీ డిజైన్ చేశారు. ఇందులో 5 ఇంచ్ ల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో వాయిస్ అసిస్ట్, మ్యూజిక్ కంట్రోల్, నేవిగేషన్, గో ప్రొ కంట్రోల్, బ్లూటూత్ వంటి ఆకర్షణీయమైన ఆప్షన్లు ఉన్నాయి. 

ఈ బైక్ కు ఫ్రంట్ సైడ్ అప్ సైడ్ డౌన్ ఫోర్క్స్, వెనుకవైపు మోనో షాక్ అబ్సార్బర్స్ ను అమర్చారు. కు అత్యాధునిక టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్ మొదలైన సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

ఈ బైక్ లో అడ్వాన్స్డ్ లైటింగ్ ఫీచర్స్ ఉన్నాయి. క్లాస్ డీ డైనమిక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ను అమర్చారు. ఇది స్పీడ్ అండ్ క్లైమేట్ ను బట్టి లైటింగ్ లో మార్పులు చేసుకోవచ్చు. ఈ బైక్ తో పాటు నకుల్ గార్డ్ వైజర్ లభిస్తుంది. ఈ బైక్ కు టీవీఎస్ 24 గంటల రోడ్ సైడ్ అసిస్టెన్స్ అందిస్తోంది. 

ఈ బైక్ లో 312.2 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ను అమర్చారు. ఇది గరిష్టంగా 35 బీహెచ్పీ పవర్ ను, 28.7 ఎన్ఎం పీక్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.

TVS Apache RTR 310 షో రూమ్ ధర రూ. 2.43 లక్షలు