ఎప్పట్లాగే ఈనెల కూడా బోలెడన్ని స్మార్ట్‌ఫోన్స్ రిలీజవబోతున్నాయ్. పండుగ సీజన్ కావటంతో కంపెనీలన్నీ వరుసగా కొత్త ఫోన్స్‌ని మార్కెట్లోకి తెస్తున్నాయ్. మరి కొత్తగా వస్తున్న లేటెస్టు ఫోన్లు ఏవి? వాటి ఫీచర్లు, ధరల వివరాలు ఏంటి? తెలుసుకోండి…
రియల్ మి 7ఐ
ఒప్పోకు చెందిన కో బ్రాండ్ రియల్‌మి నుంచి వచ్చిన మరో బడ్జెట్ రేంజ్ ఫోన్ ‘రియల్‌మి 7ఐ’.
ఫ్లిప్‌కార్ట్ ఫ్లాష్‌సేల్‌లో అందుబాటులో ఉంటుంది.
6.5 అంగుళాల డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10 ఓఎస్
4 జీబీ/64 జీబీ, 4 జీబీ/128 జీబీ
క్వాడ్రపుల్ రేర్ కెమెరా
(64ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
16 ఎంపీ ఇన్‌డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్
ధర: సుమారు ₹11,999/ ₹12,999
పోకో సీ3
షావోమీ నుంచి పోకో సిరీస్‌లో వచ్చిన బడ్జెట్ ఫోన్ ఇది.
బడ్జెట్ రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వాళ్లకు ఇది మంచి ఆప్షన్.
6.5 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే
మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10 ఓఎస్
3 జీబీ/32 జీబీ, 4 జీబీ/64 జీబీ
ట్రిపుల్ రేర్ కెమెరా (13ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫేస్ అన్‌లాక్
ధర: సుమారు ₹7,799/ ₹8,999
సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్41
పవర్‌ఫుల్ బ్యాటరీతో రీసెంట్‌గా సామ్‌సంగ్ కంపెనీ ‘గెలాక్సీ ఎఫ్ 41’ ఫోన్‌ను లాంచ్ చేసింది.
ఈనెల 16 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.
6.4 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే
సామ్‌సంగ్ ఎగ్జినోస్
9611 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10 ఓఎస్
6 జీబీ/64 జీబీ, 6 జీబీ/128 జీబీ
ట్రిపుల్ రేర్ కెమెరా
(64ఎంపీ+5ఎంపీ+8ఎంపీ)
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
6,000 ఎంఏహెచ్ బ్యాటరీ
15 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్
ధర: సుమారు ₹16,999
ఇన్ఫినిక్స్ హాట్ 10
తక్కువ ధరలో, మంచి ఫీచర్స్‌తో వచ్చిన ఫోన్ ఇది.
లో ప్రైస్‌లో బెస్ట్ క్వాలిటీ కోరుకునే వాళ్లకు ఇది మంచి ఆప్షన్. ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లాష్‌సేల్‌లో అందుబాటులో ఉంటుంది.
6.7 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే
మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10 ఓఎస్
6 జీబీ/128 జీబీ
ట్రిపుల్ రేర్ కెమెరా (16ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
డీటీఎస్ సరౌండ్ సౌండ్
5,200 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫింగర్‌ప్రింట్ సెన్సర్
ధర: సుమారు ₹ 9,999
అమెజాన్ నుంచి కొత్త ఎకో డివైజ్‌లు
వైఫై ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ఎకో స్పీకర్ల కొత్త మోడల్స్‌ను అమెజాన్ ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. సరికొత్త డిజైన్లు, మెరుగైన ఆడియో, పవర్‌ఫుల్ హార్డ్‌వేర్ వీటి స్పెషాలిటీలు. వీటిలో ‘ఎకో డాట్’ స్పీకర్ రేటు రూ.4,499. మరో మోడల్ క్లాక్ ఎకో డాట్‌లో ఎల్‌ఈడీ డిస్‌ప్లే, గోళాకార డిజైన్ ఉంటాయి. దీని రేటు రూ.5,500. ఈ రెండింటి ఫీచర్లతో రూపొందించిన మరో ఎకో డివైజ్ జిగ్‌బీ హబ్‌ను రూ.10 వేలకు అమ్ముతారు. డాల్బీ స్టీరియో సౌండ్, స్మార్ట్ హోమ్ సెట్-అప్ దీని ప్రత్యేకతలు. ఈ సందర్భంగా అమెజాన్ డివైజెస్ (ఇండియా) హెడ్ పరాగ్ గుప్తా మాట్లాడుతూ, ‘‘ఈ స్పీకర్లలోని అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ను ఉపయోగించుకొని మ్యూజిక్, న్యూస్ వంటివి వినొచ్చు. స్మార్ట్ హోం డివైజ్‌లను కంట్రోల్ చేయొచ్చు. అలారమ్ పెట్టుకోవచ్చు. టెంపరేచర్‌ను తెలుసుకోవచ్చు’’ అని వివరించారు.