Dussehra 2024 : కొత్త చిత్రల పోస్టర్ల సందడి

Dussehra 2024 : కొత్త చిత్రల పోస్టర్ల సందడి

దసరా వేళ కొత్త పోస్టర్లతో సందడి చేశారు యంగ్ హీరోలు.  నితిన్,  శ్రీలీల  జంటగా  వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న  ‘రాబిన్‌‌‌‌హుడ్’ చిత్రం నుంచి విడుదలైన కొత్త పోస్టర్ ఆకట్టుకుంది. ఇందులో స్టైలిష్ గెటప్‌‌‌‌లో ఇద్దరూ ఇంప్రెస్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది.  ఇక విశ్వక్ సేన్ నటిస్తున్న మెకానిక్ రాకీ’ చిత్రం నుంచి పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. 

ఇందులో విశ్వక్ ఇంటెన్స్‌‌‌‌ లుక్‌‌‌‌లో ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి డైరెక్షన్‌‌‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.  అలాగే అశోక్ గల్లా నటిస్తున్న  ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రం నుంచి వచ్చిన స్పెషల్ పోస్టర్ ఆకట్టుకుంది. 

ఈ దసరాకి  సిద్ధు జొన్నలగడ్డ డబుల్ ట్రీట్ ఇచ్చాడు. ‘జాక్’ అంటూ ఆడియెన్స్ ముందుకొస్తూనే,  ‘కోహినూర్’ టైటిల్‌‌‌‌తో  కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. రవికాంత్ పేరేపు డైరెక్షన్‌‌‌‌లో రెండు భాగాలు ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇక తేజ సజ్జా ‘మిరాయ్’ పోస్టర్   స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌గా నిలిచింది.  అక్షయ్, మమిత బైజు జంటగా తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘డియర్ కృష్ణ’. దినేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా, పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రం నుంచి లాంచ్ చేసిన స్పెషల్ పోస్టర్ ఆకట్టుకుంది.