
కార్తీక్ రాజు, త్వరిత నగర్ జంటగా అంజీ రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ముహూర్తపు షాట్‌కి నిర్మాత దండమూడి అవనీంద్ర కుమార్ క్లాప్ కొట్టారు. సింగర్ మనో కెమెరా స్విచాన్ చేశారు. ఆకాష్ పూరి గౌరవ దర్శకత్వం వహించాడు. ‘సోషల్ క్రైమ్ ఇష్యూస్ ఆధారంగా రాసుకున్న కథ. స్క్రిప్ట్ అద్బుతంగా కుదిరింది. నవంబర్ 14 నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేయబోతున్నాం’ అన్నాడు దర్శకుడు.
‘లవ్, యాక్షన్ అంశాలు కలగలిసిన క్రైమ్ డ్రామా ఇది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు’ అని చెప్పాడు హీరో కార్తిక్ రాజు. ‘డిఫరెంట్ స్టోరీ లైన్‌తో వస్తోన్న ఈ చిత్రంలో నటించడం హ్యాపీ’ అంది త్వరిత. నిర్మాత మాట్లాడుతూ ‘మా ప్రొడక్షన్‌లో ఇది రెండో చిత్రం. హైదరాబాద్, బ్యాంకాక్, పుకెట్‌తో సహా పలు ప్రాంతాల్లో షూటింగ్ చేయబోతున్నాం’ అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గొట్టిపాటి సాయి, లిరిసిస్ట్ భాస్కరభట్ల పాల్గొన్నారు.