ములుగు, వెలుగు : ములుగులో కొత్త సినిమా షూటింగ్ జరిగింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాయతీరాజ్ కార్యాలయం ఎదురుగా షూటింగ్ నిర్వహించారు. జబర్దస్త్, బలగం మూవీ ఫేం రచ్చ రవి కూడా వారితో కనిపించడంతో జనం వారిని చూసేందుకు తరలివచ్చారు.
గ్రామీణ వాతావరణంతో కూడిన సినిమాను కొత్త డైరెక్టర్, కొత్త హీరో హీరోయిన్లతో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. కాగా, ములుగులో భారీ సెట్లతో సుమారు 150మంది యూనిట్ సిబ్బంది హంగామా చేయడంతో సందడి నెలకొంది. రచ్చరవితో ఫొటోలు దిగేందుకు స్థానికులు ఉత్సాహపడ్డారు.