
టైటిల్ : డీడీ రిటర్న్స్
డైరెక్షన్ : ఎస్ ప్రేమ్ ఆనంద్
కాస్ట్ : సంతానం, సురభి, మాసూమ్ శంకర్, ప్రదీప్ రామ్ సింగ్ రావత్, మారన్, రెడిన్ కింగ్స్‌లీ, మొట్టా రాజేంద్రన్, మునిష్కాంత్, దీనా, సేతు, తంగదురై
లాంగ్వేజ్ : తమిళం (తెలుగు)
ప్లాట్ ఫాం : జీ5
సతీష్ (సంతానం) ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. ఆపదల్లో చిక్కుకున్న అతని లవర్ (సురభి)ని కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. అందులో భాగంగానే ఆమెకు అవసరమైన డబ్బు ఇవ్వాలి అనుకుంటాడు. కానీ.. అతని దగ్గర అంత డబ్బు ఉండదు. దాంతో తప్పని పరిస్థితుల్లో ఒక వ్యాపారవేత్త నుంచి పెద్ద మొత్తంలో డబ్బు దొంగతనం చేస్తాడు. అయితే.. తన ఫ్రెండ్స్ ఆ డబ్బుని ఒక పాత బంగ్లాలో దాచిపెడతారు. ఆ తర్వాత డబ్బు తెచ్చుకోవడం కోసం వెళ్లిన సతీష్, అతని గర్ల్‌ఫ్రెండ్, ఫ్రెండ్స్ కూడా ఆ బూత్ బంగ్లాలో చిక్కుకుంటారు. వాళ్లు డబ్బుతో బయటికి వెళ్లాలంటే.. ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాలు తమతో గేమ్ ఆడాలని కండిషన్ పెడతాయి. అయితే.. ఆ గేమ్‌లో గెలిచినవాళ్లు మాత్రమే బయటికి వెళ్తారు. ఓడిపోయిన వాళ్లను దెయ్యాలు అక్కడే చంపేస్తాయి. సతీష్ తన ఫ్రెండ్స్‌తో కలిసి గేమ్ ఆడి గెలిచాడా? ఓడిపోయాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సంతానం హీరోగా 2016లో వచ్చిన ‘దిల్లుకు దుడ్డు’ సినిమాకు సీక్వెల్‌గా ఈ డీడీ రిటర్న్స్ సినిమా తీశారు. అయితే.. మరో సినిమా కూడా రానున్నట్లు డైరెక్టర్ ఈ సినిమాలో హింట్ కూడా ఇచ్చాడు. హారర్‌తోపాటు కామెడీ కూడా బాగా పండింది. సంతానం యాక్టింగ్ బాగుంది. మొత్తానికి సినిమా కడుపుబ్బా నవ్విస్తుంది. స్క్రీన్‌ప్లే బాగుంది.