స్ట్రీమ్ ఎంగేజ్ : ఈ వారం OTT లో వచ్చిన మూవీస్ ఇవే

స్ట్రీమ్ ఎంగేజ్ : ఈ వారం OTT లో వచ్చిన మూవీస్ ఇవే

ఇసుక స్మగ్లింగ్​

టైటిల్ : కడకన్
ప్లాట్​ ఫాం : స‌‌న్ నెక్స్ట్ 
డైరెక్షన్ : షాజిల్ మంపాడ్
కాస్ట్​ :  హకీమ్ షాజహాన్, సోనా ఒలికల్, హరిశ్రీ అశోకన్​, శరత్ సబ, జాఫర్ ఇడుక్కి, మణికందన్ ఆచారి

సుల్ఫీ (హకీమ్ షాజహాన్),  మణి (మణికందన్ ఆచారి) ఇద్దరూ మంచి ఫ్రెండ్స్​.  వాళ్ల తండ్రులు కూడా స్నేహితులే. సుల్ఫీ తండ్రి హైదర్ అలీ (హరిశ్రీ అశోకన్) గతంలో ఇసుక స్మగ్లింగ్​ చేసేవాడు. దాని వల్ల బాగా డబ్బు సంపాదించాడు. అయితే.. ఇసుక ​ స్మగ్లింగ్​ విషయంలోనే సుల్ఫీ, మణి మధ్య గొడవ జరుగుతుంది. దాంతో ఇద్దరూ శత్రువులుగా మారిపోతారు. అప్పుడే సుల్ఫీ జీవితంలోకి లక్ష్మి (సోనా ఒలికల్) వస్తుంది. 

సుల్ఫీ ఆమెని ప్రేమిస్తాడు. ఇదిలా ఉండగా.. ఒకరోజు సుల్ఫీ సర్కిల్ ఇన్‌‌స్పెక్టర్ రాజీవ్ (రంజిత్)తో వాగ్వాదానికి దిగుతాడు. రాజీవ్​తో హైదర్​ అలీకి గతంలో వ్యక్తిగత గొడవ ఉండటంతో సుల్ఫీని ఎలాగైనా దెబ్బతీయాలి అనుకుంటాడు. కానీ.. అతను మాత్రం రాజీవ్​కు తెలియకుండా దందా చేస్తూనే ఉంటాడు. మణితో సుల్ఫీకి ఎలాంటి గొడవలు ఉన్నాయి? లక్ష్మి ఎవరు? సుల్ఫీ చివరికి ఇసుక స్మగ్లింగ్​ మానేశాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాలి. 

రత్నగిరిలో ఏం జరిగింది? 

టైటిల్ : ఆల్‌‌ వి ఇమాజిన్‌‌ యాజ్‌‌ లైట్‌‌
ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్​ హాట్‌‌స్టార్‌‌
డైరెక్షన్ : పాయల్‌‌ కపాడియా
కాస్ట్​ :  కని కుశ్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్‌‌, హృదు హరూన్‌‌

ముంబైలోని ఒక పెద్ద హాస్పిటల్​లో ప్రభ (కని కుశ్రు తి), అను (దివ్య ప్రభ) నర్సులుగా పనిచేస్తుంటారు. పెళ్లయిన కొద్దిరోజులకే ప్రభ భర్త జర్మనీకి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఒక్క ఫోన్​ కూడా చేయడు. అను, షియాజ్‌‌ (హృదు హరూన్‌‌)  ప్రేమించుకుంటారు. ఇద్దరూ రెగ్యలర్​గా కలుసుకోవాలి అనుకుంటారు. అందుకోసం ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబైలో ప్రశాంతంగా గడిపేందుకు కొత్త కొత్త ప్లేస్​లకు వెళ్తుంటారు.

 వీళ్లు పనిచేసే హాస్పిటల్​లోనే పార్వతి (ఛాయా కదమ్‌‌) వంట మనిషిగా పనిచేస్తుంటుంది. ఆమె ఎన్నో ఏండ్లుగా ఉంటున్న ఇంటిని కొందరు ఆక్రమించుకుంటారు. వాళ్లతో పోరాడలేక సొంతూరు రత్నగిరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. సరిపడా జీతం రాక ఇబ్బంది పడుతున్న ప్రభ, అను కూడా ఆమెతో రత్నగిరి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రభ తన భర్తను కలిసిందా? లేదా? అనేది మిగతా కథ. 

ఆ ఇంట్లో ఉన్నదెవరు?

టైటిల్ : ఆరగన్
ప్లాట్​ ఫాం : ఆహా తమిళ్​
డైరెక్షన్ : అరుణ్ కెఆర్
కాస్ట్​ :  మైఖేల్ తంగదురై, కవిప్రియ మనోహరన్, శ్రీరంజని, కలైరాణి, యాజర్

శరవణన్ (మైఖేల్ తంగరాజ్), మగజిని నీల (కవిప్రియ) ప్రేమించుకుంటారు. తమ భవిష్యత్తు కోసం రకరకాల ప్లాన్స్​ వేసుకుంటారు. శరవణన్ బిజినెస్​ చేయాలని కలలు కంటుంటాడు. మగజిని ఒక హిల్ స్టేషన్‌‌లో శిథిలావస్థలో ఉన్న ఓ ఇంట్లో ఉద్యోగంలో చేరుతుంది. అక్కడ వళర్మతి (శ్రీ రంజని) అనే పెద్దావిడను చూసుకోవడమే ఆమె పని. ఫోన్ సిగ్నల్స్​ కూడా రాని ప్లేస్​ అది. అక్కడికి వెళ్లాక మగజిని తాను గర్భవతి అని తెలుసుకుంటుంది. అప్పటినుంచి ఆమెకు పీడకలలు వస్తుంటాయి. ఆ ఇంట్లో కట్టేసి ఉన్న ఒక పెద్దావిడ(కలై రాణి)ను మగజిని చూస్తుంది. అప్పుడే ఆమెకు శరవణన్​కు గురించి ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? ఇంతకీ శరవణన్​ ఎవరు? ఆ పెద్దావిడని ఎందుకు కట్టేశారు? మగజిని ఆ హిల్​స్టేషన్​కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాలి. .