OTT Movies : ఈ వారం (ఏప్రిల్ 20 నుంచి 27) ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movies : ఈ వారం (ఏప్రిల్ 20 నుంచి 27)  ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓ బాలుడి ఆవేదన

టైటిల్ : మిథ్య (కన్నడ)
ప్లాట్​ ఫాం : అమెజాన్​ ప్రైమ్​ వీడియో, 
డైరెక్షన్ : సుమంత్ భట్
కాస్ట్​ : అతీష్ శెట్టి, అవిష్ శెట్టి, ప్రకాష్ తుమినాద్​, రూప వర్కాడి

మిథున్ అలియాస్​ మిథ్య (అతిష్ శెట్టి) ముంబైకి చెందిన 11 ఏళ్ల బాలుడు. అనుకోకుండా అతని తండ్రి చనిపోతాడు. దాంతో తల్లి ఆత్మహత్య చేసుకుంటుంది. మిథ్యాతోపాటు తన చెల్లి వందన(అవిష్​ శెట్టి)ని వాళ్ల మేనమామ సూర్య (ప్రకాష్ తుమ్మినాద్), అత్త జ్యోతి (రూప వర్కాడి) తమ ఇంట్లో ఉంచుకునేందుకు ముంబై నుంచి కేరళలోని ఉడుపికి తీసుకెళ్తారు. 

వాళ్లు కూడా మిథ్యాని బాగానే చూసుకుంటారు. అయినా.. అతను తన తల్లిదండ్రులతో గడిపిన క్షణాలను మర్చిపోలేకపోతుంటాడు. తన గతం నుండి బయటపడటానికి ఎంత ప్రయత్నించినా ఆ మెమొరీస్​ నిత్యం వెంబడిస్తూనే ఉంటాయి.  ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. 

వాళ్లిద్దరి మధ్య...

టైటిల్ : జెంటిల్ ఉమెన్ 
ప్లాట్​ ఫాం : అమెజాన్​ ప్రైమ్​ వీడియో
 డైరెక్షన్ : జాషువా సేతురామన్,
కాస్ట్​ : లిజోమోల్ జోస్, లోస్లియా మరియనేసన్, హరి కృష్ణన్

అరవింద్ (హరి కృష్ణన్) ఎల్​ఐసీలో పనిచేస్తుంటాడు. తల్లిదండ్రులు లేని పూర్ణి (లిజోమోల్ జోస్)ని పెండ్లి చేసుకుని చెన్నైలోని ఒక అపార్ట్‌‌‌‌మెంట్​లో కాపురం ఉంటాడు. అరవింద్​ని పూర్ణి బాగా చూసుకుంటుంది. అరవింద్​ కూడా ఎప్పుడూ పూర్ణిని సంతోషపెట్టేందుకే ప్రయత్నిస్తుంటాడు. అలా సాఫీగా సాగుతున్న వాళ్ల జీవితాల్లోకి అన్నా (లోస్లియా మరియనేసన్) వస్తుంది. ఆమె పూర్ణి ఫ్రెండ్, చెల్లెలు లాంటిది. అన్నా చెన్నైలో ఇంటర్వ్యూ కోసమని పూర్ణి ఇంటికి వస్తుంది. 

అప్పుడే ఆమెపై  అరవింద్​ కన్ను పడుతుంది. ఒకరోజు పూర్ణిని పనిమీద బయటికి పంపించి అన్నాతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలు కథ. ​

అసలైన ఛాంపియన్ ఎవరు?

టైటిల్ : దావీద్​
ప్లాట్​ ఫాం : జీ5 
డైరెక్షన్ : గోవింద్ విష్ణు,
కాస్ట్​ : ఆంటోని వర్గీస్, లిజోమోల్ జోస్, మో ఇస్మాయిల్, విజయరాఘవన్

బాక్సర్​ ఆషిక్ అబు (ఆంటోని వర్గీస్) అనుకోకుండా చేసిన ఒక తప్పు వల్ల జైలుకు వెళ్తాడు. తిరిగొచ్చాక పెండ్లి చేసుకుని గుట్టుగా బతుకుతుంటాడు. అతని భార్య షెరిన్ (లిజోమోల్ జోస్) ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతలను చూసుకుంటుంది. ఆమెకు సాయంగా ఉండేందుకు అబు బౌన్సర్​గా ఉద్యోగంలో చేరతాడు. ఒకరోజు డ్యూటీకి వెళ్లి టర్కీకి చెందిన ఇంటర్నేషనల్​ బాక్సింగ్ ఛాంపియన్ సైనుల్ అఖ్మదోవ్ (మో ఇస్మాయిల్) మీద చేయిచేసుకుంటాడు. 

దాంతో అతను అబుని తనతో పోటీపడమని సవాల్​ చేస్తాడు. గెలిస్తే.. భారీ బహుమతి ఇస్తానని చెప్తాడు. అబు మొదట్లో ఒప్పుకోకపోయినా పరిస్థితులవల్ల చివరికి ‘సరే’ అంటాడు. కోచ్ ఆషాన్ (విజయరాఘవన్) దగ్గర శిక్షణ​ తీసుకుంటాడు. ఆ పోటీల్లో అబు తన ప్రత్యర్థిని ఓడిస్తాడా? లేదా? అతని గతమేంటి? తెలియాలంటే సినిమా చూడాలి. 

►ALSO READ | సైకలాజికల్ థ్రిల్లర్‌‌తో వస్తున్నా సోనాక్షి సిన్హా .. నికితా రాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల