OTT Movies : ఓటీటీలో ఈ వారం రిలీజయ్యే సినిమాలు

OTT Movies : ఓటీటీలో ఈ వారం రిలీజయ్యే సినిమాలు

ఆ ఇద్దరు ఎవరు? 

టైటిల్ : అం అః, 

ప్లాట్​ ఫాం : సన్​ నెక్స్ట్‌, 

డైరెక్షన్ : థామస్ సెబాస్టియన్, కాస్ట్​ : దిలీష్ పోతన్, జాఫర్ ఇడుక్కి, మీరా వాసుదేవ్, దేవదర్శిని, బేబీ నిహారా

స్టీఫెన్ (దిలీష్ పోతన్) రోడ్డు కాంట్రాక్టర్. ఇడుక్కికి దగ్గర్లోని ఒక మారుమూల కొండ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు చూసుకునేందుకు వెళ్తాడు. అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఇబ్బందిపడుతుంటాడు.  గ్రామస్తులు మాత్రం అతన్ని చాలా బాగా చూసుకుంటారు. కానీ.. అతను వాళ్లలో ఒక రకమైన అశాంతిని గమనిస్తాడు. దాని వెనక ఏదో లోతైన రహస్యం ఉంది అనుకుంటాడు. అప్పుడు స్టీఫెన్​ అదే ఊరిలో ఉంటున్న ఒక అమ్మమ్మ (దేవదర్శిని), ఆమె మనవరాలు (బేబీ నిహారా) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటాడు. ఇంతకీ వాళ్లెవరు? స్టీఫెన్​ ఏం తెలుసుకున్నాడు? తెలియాలంటే సినిమా చూడాలి. 

కోడళ్లకు శాపం

టైటిల్ : అయ్యన మనే, 

ప్లాట్​ ఫాం : జీ5, డైరెక్షన్ : రమేష్ ఇందిర,
కాస్ట్​ : కుషీ రవి, మానసి సుధీర్, అక్షయ్ నాయక్, వాణిశ్రీ కులకర్ణి, అనిరుధ్ ఆచార్య, అర్చన కొట్టిగే, శోభరాజ్ పావూర్, ఖుషి చంద్రశేఖర్

కొత్తగా పెళ్లైన జాజి (కుషీ రవి) తన భర్త దుష్యంత్ (అక్షయ్ నాయక్)తో మెట్టినింటికి వెళ్తుంది. దుష్యంత్​ది ఉమ్మడి కుటుంబం. అతని తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు, సోదరితో కలిసి తరతరాల నుంచి వస్తున్న ఒక పెద్ద ఇంట్లో ఉంటారు. జాజి అడుగుపెట్టినప్పటి నుంచి ఆ ఇంట్లో ఆమెకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇంటి పక్కన ఉన్న బావి నుంచి వింత శబ్దాలు వస్తుంటాయి.

  అర్ధరాత్రి నట్టింట్లో ఒక మహిళ ఉరి వేసుకున్నట్టు కనిపిస్తుంది. దాంతో జాజి బాగా భయపడుతుంది. తర్వాత ఆ ఇంటికి శాపం ఉందని, ఇంటి కోడళ్లు ఒక్కొక్కరుగా చనిపోతారని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? చావులకు కారణం ఏంటి? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. 

మెరిసే రాయిలో ఆత్మ!

టైటిల్ : గార్డియన్, 

ప్లాట్​ ఫాం : ఆహా, డైరెక్షన్ : గురు శరవణన్,
కాస్ట్​ : హన్సిక, సురేష్ మీనన్, శ్రీమన్, ప్రదీప్, అభిషేక్ వినోద్

అప‌ర్ణ(హ‌న్సిక‌)ని చిన్నప్పటి నుంచి దుర‌దృష్టం వెంటాడుతుంటుంది. అందుకే కొందరు ఆమెని ‘అన్‌ల‌క్కీ అప‌ర్ణ’ అని పిలుస్తుంటారు. ఆమె ఒక కంపెనీలో ఇంటీరియర్​ డిజైనర్​గా పనిచేస్తుంటుంది. ఒకసారి ప్రాజెక్ట్‌ వర్క్‌ మీద కన్​స్ట్రక్షన్​లో ఉన్న బిల్డింగ్ దగ్గరకు వెళ్తుంది. అక్కడామెకు ఒక మెరిసే రాయి దొరుకుతుంది. అప్పటినుంచి ఆమె ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది. 

పెద్ద కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది. దూరమైన తన లవర్​ మళ్లీ ఆమె జీవితంలోకి వ‌స్తాడు. చివరకు తన కోరికలన్నీ నెరవేరడానికి కారణం ఆ రాయిలో ఉన్న ఆత్మ అని తెలుసుకుంటుంది. ఇంతకీ ఆ ఆత్మ ఎవరిది? రాయిలో ఎందుకుంది?