
ఆ ఇంట్లో..
టైటిల్ : చూ మంతర్
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
డైరెక్షన్ : నవనీత్
కాస్ట్ : శరణ్, చిక్కన్న, అదితి ప్రభుదేవా, మేఘనా గాంకర్, రజనీ భరద్వాజ్, కిరణ్ చంద్రశేఖర్
డైనమో అలియాస్ గౌతమ్ (శరణ్) ఒక భూతవైద్యుడు. తన టీం ఆర్జే (చిక్కన్న), అదితి(అదితి ప్రభుదేవా), నకుల్ (కిరణ్ చంద్రశేఖర్)తో కలిసి ‘చూ మంతర్ అండ్ కో’ అనే కంపెనీని నడుపుతుంటాడు. ఒకసారి గౌతమ్ నైనిటాల్‌లో ఉన్న హాంటెడ్ ప్లేస్ ‘మోర్గాన్ హౌస్’ గురించి తెలుసుకుంటాడు. దాన్ని ఎలాగైనా ఎక్స్ప్లోర్ చేయాలనే ఆత్రుత అతనిలో పెరుగుతుంది. వెంటనే తన టీంతో కలిసి అక్కడికి వెళ్లిపోతాడు.
ఆ మాన్షన్ హౌస్‌లో ఒకప్పుడు బ్రిటిష్ అధికారి జార్జ్ మోర్గాన్ ఉండేవాడు. కానీ.. వీళ్లు వెళ్లే టైంకి అందులో ఒక దెయ్యం ఉంటుంది. దాని వలలో చిక్కుకున్న ఈ నలుగురు ఎలా తప్పించుకున్నారు? ఆ దెయ్యం నేపథ్యం ఏంటి? అనేది మిగతా కథ.
ఆమె ఎవరు?
టైటిల్ : హంట్ (మలయాళం),
ప్లాట్ ఫాం : మనోరమా మ్యాక్స్,
డైరెక్షన్ : షాజీ కైలాస్,
కాస్ట్ : భావన, రెంజీ పనికర్, చందునాథ్, డైన్ డేవిస్, అను మోహన్, సురేష్ కుమార్
కీర్తి (భావన) ఒక ఫోరెన్సిక్ సర్జన్. పొట్టి (సురేష్ కుమార్) నేతృత్వంలోని ఒక టీంలో పనిచేస్తుంటుంది. కీర్తికి ఒక మహిళ (అదితి రవి) హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను కనిపెట్టే పని అప్పగిస్తారు. ఆ కేసుకు సంబంధించిన రీసెర్చ్ మొదలుపెట్టినప్పటినుంచి కీర్తి జీవితంలో ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఓ ఆత్మ ఆమెను వెంటాడుతుంటుంది. కీర్తి సాయంతో తన మరణానికి కారణమైన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటుంది. ఇంతకీ ఆ ఆత్మ ఎవరిది? కీర్తికి ఆ ఆత్మతో ఉన్న సంబంధం ఏంటి? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
తాగిన మత్తులో..
టైటిల్ : మందాకిని,
ప్లాట్ ఫాం : ఈటీవీ విన్
డైరెక్షన్ : ఉన్ని లీల
కాస్ట్ : అల్తాఫ్ సలీం, అనార్కలి మరికర్, సరిత కుక్కు, వినీత్ తట్టిల్, గణపతి, అశ్వతి శ్రీకాంత్
అరోమల్ (అల్తాఫ్ సలీమ్), అంబిలి (అనార్కలి మరిక్కర్) పెద్దలు కుదిర్చిన పెండ్లి చేసుకుంటారు. వాళ్ల ఫస్ట్ నైట్‌కు సంప్రదాయ పద్ధతిలో ఏర్పాట్లు చేస్తారు. అయితే.. అరోమల్ ప్రెండ్స్ సరదాగా అతడిని ఆట పట్టించాలి అనుకుంటారు. అందుకే కూల్ డ్రింక్‌లో మందు కలిపి ఫస్ట్‌నైట్ గదిలోకి పంపుతారు. కానీ.. పొరపాటున ఆ డ్రింక్‌ని అంబిలి తాగేస్తుంది. ఆ మత్తులో పెండ్లికి ముందు జరిగిన తన ప్రేమ కథను అరోమల్తో పంచుకుంటుంది. తన మాజీ బాయ్‌ఫ్రెండ్ సుజిత్ వాసు (గణపతి)ని మళ్లీ కలవాలి అనుకుంటున్నట్టు కూడా చెప్తుంది. అంబిలి ప్రేమ వ్యవహారం తెలిసిన ఆరోమల్ తల్లి రాజ్యలక్ష్మి (సరిత కుక్కు) ఆమెను సుజిత్ దగ్గరికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే అసలు కథ.