కఠినంగా కొత్త మున్సిపల్ చట్టం

కఠినంగా కొత్త మున్సిపల్ చట్టం
  • నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించొద్దు
  • ప్రజా సమస్యలకు ప్రాధాన్యమివ్వండి
  • 68 కొత్త మున్సిపాలిటీల కమిషనర్లతో డైరెక్టర్‌ శ్రీదేవి

హైదరాబాద్‌, వెలుగు :కొత్తగా ఏర్పాటు చేసిన 68 మున్సి పాలిటీల్లో కమిషనర్లు పరిపాలన అంశాలపై పట్టు సాధించాలని రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి సూచించారు. గురువారం రాష్ట్రంలోని 68 కొత్త మున్సిపాలిటీల కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్‌ చట్టం రూపొందిస్తుందని, చట్టంలో కొన్ని కఠిన అంశాలు కూడా ఉండే అవకాశం ఉందని అన్నారు. మున్సిపాలిటీల పరిధిలో నియమ నిబంధనలు అతిక్రమించేవారు ఎంతటివారైనా ఉపేక్షించరాదని ఆదేశించారు. ఆస్తి పన్నుల వసూళ్లు, బకాయిలు నూటికి నూరు శాతం వసూలు చేయాలని చెప్పారు.