రాష్ట్రపతి భవన్లో పలు వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. వాటిని ఇకపై వరుసగా గణతంత్ర మండపం, అశోక్ మండపంగా వ్యవహరించనున్నట్లు రాష్ట్రపతి సచివాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
దర్బార్ హాల్ జాతీయ అవార్డు ప్రదానం వంటి ముఖ్యమైన వేడుకలకు వేదికగా ఉంటుంది. ఆంగ్లేయులు, భారత పాలకులు సమావేశాలు నిర్వహించిన ప్రాంతాన్ని దర్బార్ అనేవారు. భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత ఆ పదం ప్రాముఖ్యత కోల్పోయింది.
గణతంత్ర భావన భారత సమాజంలో లోతుగా పాతుకుపోయింది. అందుకే ఈ హాల్‌కు గణతంత్ర మండపం సరైందని రాష్ట్రపతి భవన్ పేర్కొన్నది. అశోక్ హాల్ ఒక బాల్రూమ్. అశోక్ అంటే అన్ని బాధల నుంచి విమక్తుడైన వ్యక్తి అని అర్థం అని వెల్లడించింది. ఈ కారణంతోనే పేరు మార్చారు.
అశోక అన్న పదానికి అన్ని బాధల నుంచి విముక్తి కలిగిన వ్యక్తి అని అర్థం. అంతేగాక అశోక చక్రవర్తిని కూడా సూచిస్తుంది. ఇది ఐక్యత, శాంతియుత సహజీవనానికి చిహ్నం. అశోక్ హాల్ పేరును అశోక్ మండపంగా మార్చడం భాషలో ఏకరూపతను తెలుస్తుందని రాష్ట్రపతి భవన్ పేర్కొన్నది.