దర్యాప్తు సంస్థలకు కొత్త రూల్స్!..కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సుప్రీంకోర్టు ఏమంటుందంటే

దర్యాప్తు సంస్థలకు కొత్త రూల్స్!..కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సుప్రీంకోర్టు ఏమంటుందంటే

డిజిటల్ డాక్యుమెంట్ల స్వాధీనం, నిర్వహణ సక్రమంగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలకు మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా సూచిస్తోంది..ఇటీవల శాంటియాగో మార్టిన్ కేసులో ప్రైవేట్ చాట్‌ల జప్తు నుంచి మినహాయించాలని సుప్రీంకోర్టు సూచించింది. కేసు దర్యాప్తు కోసం స్వాధీనం చేసుకున్న మొబైల్, ల్యాప్ టాప్  వంటి డివైజ్ లనుంచి ప్రైవేట్ చాట్ లను కేంద్ర దర్యాప్తు సంస్థలు (ED) స్వాధీనం చేసుకోవద్దని సుప్రీంకోర్టు సూచించింది. 

దర్యాప్తు ఏజెన్సీల పరిశోధనలకు సంబంధించి డిజిటల్ లేదా పేపర్ రూపంలో డాక్యుమెంట్ల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ మార్గదర్శకాల ద్వారా వ్యక్తిగత చాట్ లు, నేరాలకు సంబంధం లేని డాక్యుమెంట్లను జప్తు చేయకుండా మార్గదర్శకాలపై దృష్టి సారించింది. 

సుప్రీంకోర్టు నిషేధం.. 

లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ ఐపోన్ నుంచి మనీలాండరింగ్ కు సంబంధించినవి , సంబంధం లేనివి అన్ని డిజిటల్ రికార్డుల రికవరీని ఇటీవల సుప్రీంకోర్టు బ్లాక్ చేసింది. మనీలాండరింగ్ కేసులో గత నవంబర్ లో ఈడీ .. శాంటియాగో మార్టిన్ ఇళ్లలో సోదాలు చేసింది. సోదాల్లో 12కోట్ల విలువై లెక్క చూపని నగదును స్వాధీనం చేసుకుంది. అయితే శాంటియాగో మార్టిన్ తన ఐఫోన్ నుంచి డిజిటల్ రికార్డులను రికవరీ చేయకుండా సెంట్రల్ ఏజెన్సీలను ఆపాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఐఫోన్ లో కేసుకు సంబంధంలేని వ్యక్తిగత చాట్ లు ఉన్నాయని వాదించారు. 

మరోవైపు అమెజాన్ సవాల్ .. 

ఫెమా నిబంధనల ఉల్లంఘటన కేసులో కూడా ఈడీ డిమాండ్ ను సుప్రీంకోర్టులో అమెజాన్ సవాల్ చేసింది.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) కి సంబంధించి కొనసాగుతున్న విచారణలో అమెజాన్ లెండర్స్ కు సంబంధించిన అన్ని ఈమెయిల్స్ కాపీలకోసం ED  డిమాండ్ చేసింది.దీనిని అమెజాన్ సవాల్ చేసింది. ఈకామర్స్ దిగ్గజాల లెండర్స్ నుంచి ఈడీ చాలా పత్రాలను స్వాధీనం చేసుకుంది..  అమెజాన్, ప్లిప్ కార్ట్ వంటి ఈకామర్స్ ఫ్లాట్ ఫాం ల లెండర్స్ ద్వారా ఎఫ్డీఐ నిబంధనలు ఉల్లంఘించి ధరలను ప్రభావితం చేస్తున్నాయని..ఈ సాక్ష్యం ఈ సెలర్లర్లు తమ అమ్మకందారులతో చేసిన కమ్యూనికేషన్ ద్వారా నిర్ధారించబడిందని ఈడీ వాదించింది. 

దర్యాప్తు కోసం స్వాధీనం చేసుకున్న డిజిటల్ డాక్యుమెంట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అమలులోకి వస్తే..  వ్యక్తిగత చాట్‌లు , నేరాలకు సంబంధం లేని డాక్యుమెంట్లను దర్యాప్తు సంస్థలు సేకరించకుండా అడ్డుకునే అవకాశం ఉంది. ఇప్పటికే లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ ఐఫోన్ నుంచి రికార్డులను రికవరీ చేయడాన్ని ఎస్సీ నిషేధించింది