OTT Movies: జనవరి 10న ఓటీటీకి 4 తెలుగు సినిమాలు.. IMDB లో అదిరిపోయే రేటింగ్.. డోంట్ మిస్

ఓటీటీకి వచ్చే సినిమాలు ప్రేక్షకుల చేత ఆదరించబడుతున్నాయి. ప్రస్తుత ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉందంటే.. థియేటర్స్లో రిలీజైన సినిమాల కంటే ఓటీటీకి వచ్చే సినిమాలనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందుకు చాలా కారణాలున్నాయి. సినిమా కంటెంట్ సమస్య కావొచ్చు.. ఆ తర్వాత మనకున్న అంచనాలు అందుకోలేక కావొచ్చు, సరిగ్గా నెల వెయిట్ చేస్తే ఓటీటీలోకి వస్తుందిలే అని కుడా అనుకోవొచ్చు.

అయితే, అసలు విషయానికి వస్తే.. నిన్న శుక్రవారం జనవరి 10న ఒక్కరోజే ఓటీటీలోకి 4 తెలుగు సినిమాలు వచ్చాయి. అందులో IMDB నుంచి ఏకంగా 7.5 నుంచి 9.1 రేటింగ్ తో కూడిన సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, లవ్ యాక్షన్ థ్రిల్లర్, రొమాంటిక్ జోనర్స్‌లో ఉన్నాయి. అవేంటనేవి చూస్తే..   

బచ్చల మల్లి:

అల్లరి నరేష్ హీరోగా సుబ్బు డైరెక్ట్ చేసిన ‘బచ్చల మల్లి’ మూవీ జనవరి 10న ఓటీటీకి వచ్చింది. రూరల్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్గా వచ్చింది. అయితే, బచ్చల మల్లికి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కకపోయిన.. IMDB నుంచి మాత్రం 9.4 రేటింగ్ సాధించుకుంది. బచ్చల మల్లి సినిమా ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అయింది.

ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్, సన్‌ ఎన్ఎక్స్‌టీలో జనవరి 10 నుంచి బచ్చల మల్లి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రైమ్‌ ఓటీటీలో మాత్రం రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. ఈ మూవీ రిలీజైన నెలలోపే సంక్రాంతి కానుకగా ఓటీటీ ఆడియన్స్ ను అలరించడానికి వచ్చింది.

మిస్ యూ:

హీరో సిద్ధార్థ్ (Siddharth), బ్యూటీ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ యూ’(Miss You). ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో శామ్యూల్ మాథ్యూ నిర్మించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ డిసెంబర్‌ 13న తెలుగులో విడుదల అయింది. ఈ శుక్రవారం జనవరి 10 నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. 

ఇకపోతే తమిళంలో ఆకట్టుకున్న ఈ మూవీ.. తెలుగు ఆడియన్స్ను అంతగా మెప్పించలేకపోయింది. అయితే, ఈ మూవీని దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా.. బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.6 కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ మూవీ ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ సంపాదించుకుంది

హైడ్ అండ్ సీక్:

తెలుగు ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన హైడ్ అండ్ సీక్.. జనవరి 10న ఆహాలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇది IMDB లో 9.1 రేటింగ్ సంపాదించుకుంది. బసిరెడ్డి రానా కథ, దర్శకత్వం వహించాడు. తమిళ హీరోయిన్ శిల్పా మంజునాథ్, విశ్వంత్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రల్లో నటించారు. 2024 సెప్టెంబర్ 20న తెలుగులో రిలీజ్ అయిన ఈ మూవీ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

ప్రేమించొద్దు:

అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో శిరిన్ శ్రీరామ్ దర్శకనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. జూన్ 7న సినిమా విడుదల అయింది.

ఇప్పుడీ ఈ మూవీ జనవరి 10 నుంచి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.అమెజాన్ ప్రైమ్ అండ్ బీ సినీ ఈటీ లేదా బీసినీట్ (Bcineet OTT) లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ IMDBలో 8 రేటింగ్ తో ఉంది. అయితే, అప్పట్లో ఈ మూవీ దర్శకనిర్మాత శిరిన్ శ్రీరామ్.. 'నా కథ కాపీ కొట్టి .. బేబి సినిమా తీశారంటూ' ఆరోపించారు.

ది సబర్మతి రిపోర్ట్‌‌:

‘ట్వల్త్‌‌ ఫెయిల్‌‌’ హీరో విక్రాంత్‌‌ మస్సే(Vikrant Massey) లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘ది సబర్మతి రిపోర్ట్‌‌’ (The Sabarmati Report). రాశీ ఖన్నా, రిద్ధి డోగ్రా హీరోయిన్స్. గోద్రా రైలు దహనం, గుజరాత్ అల్లర్ల ఆధారంగా రంజన్‌‌ చందేల్‌‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఏక్తాకపూర్ నిర్మాత.

ఈ మూవీ 2024 నవంబర్ 15న థియేటర్స్లో రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు కూడా బాగానే రాబట్టింది. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లు వసూలు చేసింది.ఈ మూవీ శుక్రవారం జనవరి 10 ను జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. 

నిజాలను వెలికితీసే జర్నలిస్టు పాత్రలో హీరో విక్రాంత్ మస్సే నటన చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అతను తన ఉద్యోగ విలువల కోసం పడే తపన, ఎంతో మంది అమాయక జీవితాలపై జరిగిన భయానక ఘటనపై చేసే విచారణ.. తనదైన నటనతో విక్రాంత్ ప్రాణం పోశాడు.