
చదువుల కోసం, టూర్, బిజినెస్ ఇలా ఏ కారణంగానైనా విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ మస్ట్ అండ్ షుడ్. చాలా దేశాలు పాస్ పోర్ట్ లో చిన్న మిస్టేక్స్ ఉన్నా విసా రిజెక్ట్ చేస్తుంటాయి. ఇటీవల అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా దేశాలు రూల్స్ ను మరింత స్ట్రిక్ట్ చేశాయి. ఈ క్రమంలో పాస్ పోర్టు అప్లికేషన్ లో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు మొదలు పెట్టింది.
పాస్ పోర్ట్ అప్లికేషన్లలో కీలకమైన డేట్ బర్త్ డీటైల్స్ ను మరింత పారదర్శకంగా ఉండేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది ప్రభుత్వం 2023 అక్టోబర్ 1వ తేదీ తర్వాత పుట్టిన వారి పుట్టిన తేదీ నిర్ధారణకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా తీసుకోనున్నట్లు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. నిబంధనలు మారుస్తూ గత వారం (2025 ఫిబ్రవరి, 4వ వారం) ప్రకటించింది ప్రభుత్వం. దీనిపై గెజిట్ వచ్చిన తర్వాత ఈ రూల్స్ అమలు కానున్నాయి.
ఇక నుంచి పాస్ పోర్ట్ అప్లై చేసేందుకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తప్పని సరిచేసింది కేంద్రం. 1969 జనన మరణాల చట్టం ప్రకారం.. సంబంధిత శాఖలు, కార్యాలయాలు, మున్సిపల్, మండల కేంద్రాలు జారీ చేసే సర్టిఫికేట్ ను మాత్రమే వ్యాలీడ్ సర్టిఫికేట్ గా పరిగణిస్తారు. ఇక నుంచి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఇతర ఏ ఆధారాలను కన్సిడర్ చెయ్యరు.
కొత్త రూల్స్ ఎందుకంటే:
గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారికి చాలా వరకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఉండవు. ఇది పాస్ పోర్ట్ అప్లికేషన్ల సమయంలో సమస్యగా మారుతోంది. అందుకోసం ఇక నుంచి అంటే 2023 తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరూ బర్త్ సర్టిఫికేట్ తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. అయితే 2023 అక్టోబర్ 1వ తేదీకి ముందు పుట్టిన వారికి పాత రూల్సే వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు. టెన్త్ క్లాస్ మెమో, టీసీ, పాన్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి ఇప్పటి వరకు డేట్ ఆఫ్ బర్త్ కోసం ప్రూఫ్ గా వాడుతున్నారు. 2023 కు ముందు పుట్టిన వారు అవే కొనసాగించవ్చు. కానీ ఆ తర్వాత పుట్టిన వారికి మాత్రం తప్పనిసరిగా బర్త్ సర్టిఫికేట్ ఉండాల్సిందే.
మరిన్ని పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు:
ప్రభుత్వం పాస్ పోర్ట్ సేవా కేంద్రాలను (POPSKs) మరిన్ని పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 442 పాస్ పోర్ట్ కేంద్రాలు ఉన్నాయి. వచ్చే 5 ఏళ్లలో వీటి సంఖ్య 600 కు పెంచేందుకు కసరత్తు ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు.