గుడ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. కొత్త పెన్షన్ స్కీం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం (ఆగస్టు 24, 2024) జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు విజ్ణాన్ ధార పేరుతో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీం ను తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.  25 యేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి పూర్తి పెన్షన్ అందిస్తామని తెలిపారు. ఇందుకోసం రూ. 10వేల 579 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. 

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..శనివారం (ఆగస్టు24,2024) నాడు  ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ పథకానికి (UPS)  కేబినెట్ ఆమోదం తెలిపింది.. మొత్తం మూడు స్కీములకు కేబినెట్ ఆమోదించింది. ఇందులో మొదటిది 50శాతం  భరోసా పెన్షన్ పథకం , రెండోది కుటుంబానికి భరోసా పెన్షన్.. ఇక మూడోది ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) నుంచి దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులు ఎన్‌పిఎస్, యుపిఎస్‌లు రెండింటిలో ఎంపిక చేసుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.