హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం- 2024-–25 విద్యా సంవత్సరానికి వివిధ సబ్జెక్టులు/ విభాగాల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో 170 సీట్లకు అప్లికేషన్స్ కోరుతోంది. జేఆర్‌ఎఫ్ అర్హత ఉన్న వారు పరీక్ష రాయనవసరం లేదు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 14వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
సబ్జెక్టులు : ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, అప్లైడ్ లింగ్విస్టిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్, రీజనల్ స్టడీస్, జెండర్ స్టడీస్, ఎకనామిక్స్, డ్యాన్స్, కమ్యూనికేషన్, మెటీరియల్ ఇంజినీరింగ్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ తదితరాలు.
అర్హతలు : కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
అప్లికేషన్స్ : ఆన్లైన్లో సెప్టెంబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 19. 20వ తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలు నవంబర్ 18 నుంచి 21వరకు ఉంటాయి.