టెక్నాలజీ ప్రపంచంలో కంపెనీలు వేటికవే పోటీ పడుతుంటాయి. అప్‌డేటెడ్ వెర్షన్స్‌తో ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తుంటాయి. అలా శామ్‌సంగ్, ఒప్పో నుంచి కొత్త ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. శాంసంగ్ నుంచి రానున్న ఏ82 5జీ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. వాటి ఫీచర్లు వావ్ అనిపించేలా ఉన్నాయంటున్నారు టెక్నాలజీ లవర్స్.
శాంసంగ్ ఏ82
శాంసంగ్ మరోకొత్త ఫోన్‌ను రిలీజ్ చేస్తోంది. త్వరలో గెలాక్సీ ఏ82 5జీ ఫోన్ లాంచ్ అవ్వనుంది. దీనికి సంబంధించి ఒక వీడియో ఆన్‌లైన్‌లో లీకైంది. కొత్త ఫీచర్లతో ఈ ఫోన్ మన ముందుకు తీసుకొస్తోంది. లీకైన వీడియో ప్రకారం స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
- 6.7 అంగుళాల డిస్‌ప్లే,
- క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్‌ప్రాసెసర్
- 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
- 64 + 12 + 5 మెగాపిక్సెల్ కెమెరా
- 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
- 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఎంఐ నుంచి 67వాట్స్ ఫాస్ట్ చార్జర్
ఎంఐ త్వరలోనే ఫాస్ట్ చార్జర్ లాంచ్ చేయనుంది. ఎంఐ 11అల్ట్రాకు కాంపోజిట్‌గా 67 వాట్స్ ఫాస్ట్ చార్జర్ లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మన దేశంలో త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఈ చార్జర్‌తో 36 నిమిషాల్లోనే ఫోన్ చార్జ్ అవుతుంది. పోయిన నెలలో అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను మన దేశంలో లాంచ్ చేసిన ఎంఐ కంపెనీ దాంతోపాటుగా 55వాట్స్ చార్జర్‌ను ఇచ్చింది. ఫోన్ లాంచింగ్ టైంలో సర్టిఫికేషన్ ప్రాబ్లమ్ రావడంతో ఆ చార్జర్‌ను ఇచ్చినట్లు కంపెనీ చెప్పింది. 67 వాట్స్ ఫాస్ట్ చార్జర్ కావాలనుకునేవారు విడిగా కొనుక్కోవాలి.
ఒప్పో కే9 5జీ
ఒప్పో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. కే9 5జీ పేరుతో ప్రస్తుతానికి చైనాలో రిలీజైన ఈ ఫోన్ త్వరలోనే మన దేశంలో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. రూ.20వేల రేంజ్‌లో దీన్ని తీసుకురాబోతోంది. వీటితో పాటు ఒప్పో కే9 స్మార్ట్ టీవీ, ఒప్పో బ్యాండ్, వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌ఫోన్స్‌ను కూడా లాంచ్ చేసింది కంపెనీ. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
- 6.43 ఇంచులు డిస్‌ప్లే
- 768జీ క్వాల్కం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్
- 32 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా
- ట్రిపుల్ కెమెరా (64+8+2)
- ఆండ్రాయిడ్ 11 ఓఎస్
- 8జీబీ/128 జీబీ, 8జీబీ/256 జీబీ
- 4300 ఎంఏహెచ్ బ్యాటరీ