రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా పలు పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్త డీసీపీ జోన్ గా మహేశ్వరంను ఏర్పాటు చేయనున్నారు. మహేశ్వరం డీసీపీ జోన్ లో కొత్తగా ఏసీపీని నియమించనున్నారు. ఇకపై ఇబ్రహీం పట్నం ఏసీపీ కూడా మహేశ్వరం డీసీపీ పరిధిలోకే వస్తారు. ఈవివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రకటించారు. రాచకొండ పరిధిలో కొత్తగా పోలీసు స్టేషన్లు ఏర్పాటుకానున్న ఏరియాల జాబితాలో చర్ల పల్లి , నాగోల్, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ, పోచారం ఐటీ కారిడార్, మల్కాజిగిరి జోన్ ఉన్నాయని చెప్పారు.
ఘట్కేసర్, జవహర్ నగర్, మహేశ్వరం, ఇబ్రహీం పట్నంలలో ట్రాఫిక్ పొలీస్ స్టేషన్లు ఏర్పాటు అవుతాయని తెలిపారు. మహాశ్వరం ట్రాఫిక్ జోన్ కు ఏసీపీని నియమిస్తామన్నారు. ఎల్బీ నగర్ జోన్, మహేశ్వరం జోన్, మల్కాజిగిరి జోన్ లలో జాయింట్ కమిషనర్ స్థాయిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటవుతుందని వివరించారు. ప్రతి జోన్ కు అడిషనల్ డీసీపీ ( లా అండ్ ఆర్డర్) స్థాయి అధికారిని నియమిస్తామని వెల్లడించారు. యాదాద్రి ఆలయానికి ఏసీపీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు.SOT కి కొత్తగా మహేశ్వరం జోన్ డీసీపీ గా ఏర్పాటు చేస్తామన్నారు. స్పెషల్ బ్రాంచ్ కు కొత్తగా1 డీసీపీని నియమిస్తామని పేర్కొన్నారు.