నల్గొండ : మునుగోడు నియోజకవర్గంలో మరోసారి పోస్టర్ల వెలిశాయి. ఈసారి ఓటర్లకు హితవు పలుకుతూ చండూర్లో పోస్టర్లు వెలిశాయి. నోటుకు ఓటు అమ్ముకోవద్దంటూ విజయ విహారం మాస పత్రిక పేరుతో ఈ పోస్టర్లను ముద్రించారు. ఓటు అమ్ముకున్న మనిషి బతికున్న శవంతో సమానమంటూ రాసి ఉన్న పోస్టర్లను గోడలకు అంటించారు.
నోట్లకు, మద్యానికి 5 ఏండ్ల భవిష్యత్తును అమ్ముకోవద్దని పోస్టర్లో సూచించారు. సంక్షేమం, సామరస్యం, సామాజిక న్యాయం అభ్యుదయం, నీతి, అర్హత, నిబద్ధత, సమర్థత వివేకతతో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కును సమర్థంగా వినియోగించుకుని దేశాన్ని మార్చాలని కోరారు.