వరంగల్​ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వరంగల్​ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

నెక్కొండ / వర్ధన్నపేట/ నల్లబెల్లి/ గూడూరు, వెలుగు: రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. వరంగల్​ జిల్లా నెక్కొండ మండలం గొట్లకొండలో గాయత్రి మహిళా పొదుపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలెక్టర్​ సత్యశారద, అడిషనల్​ కలెక్టర్​ సంధ్యారాణి, మార్కెట్​ కమిటీ చైర్మన్లు హరీశ్​రావు, శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు.

నల్లబెల్లి మండలం గిర్నిబావి, మందపల్లిలో ఎమ్మెల్యే మాధవరెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వర్ధన్నపేట మండలం ల్యాబర్తి, వెంకట్రావుపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను మార్కెట్​ కమిటీ చైర్మన్​ నరుకుడు వెంకటయ్య, పీఏసీఎస్​ చైర్మన్​ రాజేశ్​ కన్న ప్రారంభించారు. మహబూబాబాద్​ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురంలో స్వర్ణభారతి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మురళీనాయక్​ ప్రారంభించారు.