- సర్కార్ దవాఖానల్లో పేషెంట్లకు వెసులుబాటు
- ఓపీ రిజిస్ట్రేషన్ కు యాప్ తెచ్చిన కేంద్రం
- ‘అభ’ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు
- మొబైల్ కు వెంటనే రిజిస్ట్రేషన్ నంబర్
- దవాఖానకు వెళ్లి సేవలు పొందేందుకు చాన్స్
హైదరాబాద్, వెలుగు : సర్కార్ దవాఖానల్లో ఓపీ కోసం క్యూ లైన్ లో నిలబడి గంటల కొద్దీ ఎదురుచూసే పరిస్థితులకు చెక్ పడనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఓ యాప్‌ద్వారా ఓపీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఓపీ సేవలను ఈజీ చేసేందుకు కేంద్రం ఆయుష్మాన్ భారత్ డిజిటల్మిషన్ద్వారా అభ(ABHA) యాప్‌ను తీసుకొచ్చింది. ప్రతి దవాఖానకు కేటాయించిన ఒక క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి టోకెన్ నంబర్ పొందాలి.
ఇందుకు మొదటిసారి ఆస్పత్రికి వెళ్తే.. ఓపీ కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ క్యూఆర్ కోడ్ ను ఫొటో తీసుకుని మొబైల్ సేవ్ చేసుకుంటే.. మరోసారి దవాఖానకు వెళ్లకుండానే ఇంటివద్ద నుంచే రిజిస్టేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది. స్మార్ట్ ఫోన్ఉన్న ప్రతి ఒక్కరూ రిజిస్టర్ అయి ఓపీ నంబర్ తీసుకోవచ్చు.
ప్రజల్లో అవగాహన లేక..
ఆయుష్మాన్భారత్ డిజిటల్మిషన్ ద్వారా కేంద్రం అభ(ABHA) యాప్‌ను తీసుకొచ్చింది. దీనిని తెచ్చి చాలా రోజులు అవుతుండగా.. ప్రజల్లో సరైన అవగాహన లేకపోగా వినియోగించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్‌హాస్పిటల్, కోఠి ఈఎన్టీ తదితర దవాఖానల్లో యాప్సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఆయా దవాఖానల నుంచి వేల సంఖ్యలో అభ నంబర్‌ను పొందారు. యాప్‌పై సరైన అవగాహన పెంచేందుకు దవాఖానల ఓపీ కౌంటర్ల వద్ద సంబంధిత సిబ్బంది రోగులకు యాప్ గురించి అవగాహన కల్పిస్తున్నారు.
యాప్ ను ఇన్ స్టాల్ చేసి రిజిస్టర్ చేస్తున్నారు. అయితే ఈ యాప్ ద్వారా రోగులకు టైమ్‌సేవ్ అవడమే కాకుండా మెడికల్రికార్డులు కూడా యాప్ లోనే లభిస్తాయి. పేషెంట్ కు కేటాయించిన అభ నంబర్ఎంటర్ చేయడం చేస్తే డాక్టర్లు రోగి మెడికల్ హిస్టరీ ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే పేషెంట్ కు డాక్టర్ కు మధ్య కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది.
ఇలా యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి
ముందుగా మొబైల్లో ప్లే స్టోర్‌లోకి వెళ్లి అభ(ABHA) యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్లేదా ఫేస్రికగ్నైజేషన్ద్వారా రిజిస్టర్ అవ్వాలి. అనంతరం మొబైల్నంబర్ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ నంబర్ ను ఎంటర్ చేయగానే ఒక యూనిక్ నంబర్ తో మన అభ కార్డ్క్రియేట్ అవుతుంది. ఇంటర్ పేస్ లో కనిపించే స్కానర్ఆప్షన్సెలెక్ట్ చేసుకోవాలి. కెమెరా, గ్యాలరీ నుంచి దవాఖాన స్కానర్ ను స్కాన్‌చేసి ఓపీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అనంతరం దవాఖానకు టోకెన్ నంబర్ వస్తుంది. దానిని ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్వద్ద చూపించాలి. ఇలా దవాఖానలో క్యూ లైన్ లో నిలబడాల్సిన అవసరం లేకుండా పేషెంట్ కు ఓపీ ఇస్తారు.