కొత్త సంవత్సరంలో పర్సనల్ లోన్లు పొందాలంటే కష్టంగా మారనుంది. పర్సనల్ లోన్లపై ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.కొత్త రూల్స్ ప్రకారం.. ప్రతి పదిహేను రోజులకొకసారి రుణాలు ఇచ్చే ఇతర సంస్థలు(క్రెడిట్ బ్యూరోలు), బ్యాంకులు, క్రెడిట్ బ్యూరో రికార్డులను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్పు ఇండివిజువల్స్ బహుళ రుణాలు పొందడం కష్టతరం చేస్తుంది.గతంలో క్రెడిట్ బ్యూరో అప్డేట్ నెలకోసారి ఉండేది.
క్రెడిట్ బ్యూరో రిపోర్టింగ్ సమయాన్ని 15రోజులకు తగ్గించాలని బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోలకు 2024 ఆగస్టులోనే ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1 వరు గడువు ఇచ్చింది. దీంతో రుణగ్రహీతలనుంచి రిస్క్ ను తగ్గించొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది.
ALSO READ | Quadrant Future: కొత్త ఐపీవో..క్వాడ్రాంట్ ఫ్యూచర్..జనవరి 7న ప్రారంభం
సాధారణంగా EMIలు నెలలో వివిధ తేదీల్లో షెడ్యూల్ చేయబడతాయి. నెలకు ఒకసారి రిపోర్టింగ్ సైకిల్ వల్ల డీఫాల్ట్ లనుగుర్తించడం కష్టతరమవుతంది. ఈఎంఐలు 40 రోజుల వరకు ఆలస్యం కావచ్చు. ఫలితంగా క్రెడిట్ మూల్యాంకనాల కోసం పాత డేటా వస్తుంది.15-రోజుల రిపోర్టింగ్ సైకిల్‌కి మారడం వలన ఈ లేట్ ఈఎంఐలు గణనీయంగా తగ్గుతాయని ఆర్బీఐ తెలిపింది.