హైదరాబాద్ సిటీలో ప్రముఖ నేషనల్ పార్క్..కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ పెట్టారు. ఇకపై పార్కుకు వాకింగ్ కు వచ్చేవారు తమ వాహనాలను ఇ ష్టారాజ్యంగా పార్కింగ్ చేయకూడదని హెచ్చరించారు.
ఉదయం, సాయంత్రం వేళ్లలో కె.బి.ఆర్ పార్కు కు వచ్చే వాకర్లు, సందర్శకులు రోడ్లపై వాహనాలను నిర్దేశించిన సమయాల్లో మాత్రమే పార్కింగ్ చేయాలని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధించడం తప్పవన్నారు పంజాగుట్ట ట్రాఫిక్ ఏసిపి కట్ట హరి ప్రసాద్.
ALSO READ | HYDRA: రంగనాథ్ కీలక రివ్యూ.. ఇకపై హైడ్రా ఫోకస్ వాటిపైనే..
బుధవారం( అక్టోబర్ 23) బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కొంతమంది వాకర్లు ఫ్రీ లెఫ్ట్ లో వాహనాలు నిలుపుతూ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తు్న్నారని చెప్పారు.
ఫ్రీ లెఫ్ట్ లో వాహనాలు నిలపవద్దని, రోడ్ల పక్కన కూడా ఉదయం సాయంత్రం వేళల్లో నిర్దేశించిన సమయంలో మాత్రమే వాహనాలు నిలపాలని సూచించారు. అడ్డగోలుగా వాహనాలు పార్కింగ్ చేసి వెళ్లడం వల్ల రోడ్లపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోతున్నాయని వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని వాకర్లు సందర్శకులు గమనించాలని కోరారు.