సెక్రటేరియెట్​ ఉద్యోగులకు కొత్త రూల్..సంతకం బదులుగా ఫేషియల్ అటెండెన్స్

  • ఈ నెల22 నుంచి ఉద్యోగుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్ ఉద్యోగుల పనితీరు, భద్రతను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్​అటెండెన్స్​ను తీసుకురావాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటిదాకా ఉన్న రిజిస్టర్లలో సంతకం చేసే పద్ధతికి ఇక ఎండ్​ కార్డ్​ పలకనుంది. 

సర్క్యులేటింగ్​ ఆఫీసర్లు, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులతో పాటు ప్రతి ఒక్కరి అటెండెన్స్​ను ఇకపై ఫేషియల్​ రికగ్నిషన్​ సిస్టమ్​ ద్వారానే నమోదు చేయాలని పేర్కొంటూ మంగళవారం సీఎస్​ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 22 నుంచి ఉద్యోగుల ఫేషియల్​ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియను చేపడతామన్నారు. 

శాఖలవారీగా ఉద్యోగులు, అధికారులకు మెసేజ్​ ద్వారా రిజిస్ట్రేషన్​ డేట్, టైమ్,​ స్లాట్​వివరాలను పంపిస్తామన్నారు.