కాగజ్​నగర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్​లోకి నోఎంట్రీ

కాగజ్​నగర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్​లోకి నోఎంట్రీ
  • విషయాలు బయటకు తెలుస్తున్నాయని గేట్ బంద్
  • కాపలాగా యానిమల్ ట్రాకర్

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్లకు సంబంధించిన తప్పిదాలు బయటకు పొక్కుతుండడం, వార్తలు వస్తుండడంతో కొత్త రూల్ పెట్టారు. ఫారెస్ట్ ఆఫీస్​లోకి డిపార్ట్​మెంట్ వాళ్లు తప్ప వేరే ఎవరూ రాకుండా గేట్ కు చైన్ లాక్ వేస్తున్నారు. దీనికోసం యానిమల్ ట్రాకర్​ను గస్తీ పెట్టారు. గేట్ దగ్గర పొద్దంతా నిలబడి బయటి వ్యక్తులు ఎవరు వచ్చినా లోపలకు వెళ్లాలంటే గేట్ దగ్గర ఉన్న వాచర్ దగ్గర ఉన్న రిజిస్టర్ లో పేరు, ఊరు పేరు, ఎందుకోసం లోపలకు వెళ్తున్నారు, ఎవరిని కలుస్తారో ఎంట్రీ చేసుకుంటున్నారు. 

అడవి జంతువులను కాపాడుతూ, నిత్యం అడవిలో ట్రాకింగ్ చేయాల్సిన సిబ్బందికి ఇలా అదనపు డ్యూటీ వేసి గేట్ కీపర్​గా పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇన్​చార్జి రేంజ్ ఆఫీసర్ రమాదేవిని వివరణ కోరగా ఇటీవల తమకు చాలా సమస్యలు వస్తున్నాయని, అందుకే కొత్త రూల్ పెట్టామని, దీని వల్ల ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.