అన్నవరం దేవస్థానంలో వసతిగదిని ఒకసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు తీసుకునే అవకాశం లేకుండా అధికారులు నిబంధన పెట్టారు. వసతిగదిని తీసుకునే సమయంలో భక్తుడి ఆధార్ నంబరును సిబ్బంది నమోదు చేస్తారు. ఇలా ఒక ఆధార్ నంబరుపై గదిని పొందిన తర్వాత మళ్లీ 90 రోజుల వరకూ కేటాయింపునకు అవకాశం లేకుండా సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దారు. దీంతో పాటు భక్తులు గది తీసుకునే సమయంలో, ఖాళీ చేసే సమయంలో వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఏయే వసతి సముదాయం వద్ద ఎన్ని గదులు ఉన్నాయి, ఇందులో ఎన్ని బుక్ అయ్యాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయన్న వివరాలతో కొండ దిగువున సీఆర్వో కార్యాలయం వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు ఈ విధానం అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
అన్నవరం ఆలయ గదుల కేటాయింపులో కొత్త నిబంధన పెట్టారు ఆలయ అధికారులు. దేవస్థానంలో వసతిగదిని ఒకసారి తీసుకుంటే.. మళ్లీ మూడు నెలల వరకు తీసుకునే అవకాశం లేదని తెలిపారు. ఈ నిబంధన ప్రకారం.. దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న వసతి గదిని ఒకసారి అద్దెకు తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు తీసుకునే అవకాశం ఉండదనే నిబంధనను ప్రవేశపెట్టారు.
వసతిగదిని తీసుకునే సమయంలో భక్తుడి ఆధార్ నంబరును ఎంట్రీ చేస్తారు.. దాని ఆధారంగా 3 నెలల వరకు గదులు అలాట్ కాకుండా అధికారులు మార్పులు చేస్తున్నారు. ఒక ఆధార్ నంబరుపై గదిని పొందిన తర్వాత మళ్లీ 90 రోజుల వరకూ కేటాయింపుకు అవకాశం ఉండదు. దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. ఇక నుంచి భక్తులు గది తీసుకునే సమయంలో, ఖాళీ చేసే సమయంలో ఫింగర్ ప్రింట్ వేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
వసతి సముదాయం వద్ద ఎన్ని గదులు ఉన్నాయి, ఇందులో ఎన్ని బుక్ అయ్యాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయి అన్న పూర్తి వివరాలు భక్తులు తెలుసుకునేలా కొండ కింద సీఆర్వో కార్యాలయం వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. అన్నవరం ఆలయంలో గదుల కేటాయింపులో దళారులు అక్రమాలకు పాల్పడుతునందున ఈ మార్పులు చేశామని అధికారులు తెలిపారు. దీనివల్ల అసలైన భక్తులకు గదులు లభించడం లేదనే విమర‌్శలు ఉన్నాయి.. కాబట్టి గదుల విషయంలో ఇలాంటి మార్పులు చేశామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.