- ఉమ్మడి జిల్లాలో 162 గ్రామాలకు తొలగనున్న కరెంట్ కష్టాలు
- టైగర్రిజర్వ్నిబంధనలకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు
- పరిహారంగా నాన్ఫారెస్ట్ల్యాండ్ కేటాయింపునకు రాష్ట్ర సర్కార్అంగీకారం
- మొదలైన జాయింట్ సర్వే
నిర్మల్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో త్రీఫేజ్కరెంట్ సౌకర్యం లేదు. దీంతో స్థానిక ప్రజలు ఏళ్లుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతాలు కవ్వాల్టైగర్రిజర్వ్ ప్రాంతపరిధిలో ఉండటంలో అనేక నిబంధనలు అడ్డొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది.నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని 162 ఆవాసాలు కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయలేదు. అటవీ శాఖ అధికారుల సమన్వయ లోపంతో 162 గ్రామాలకు సంబంధించిన ప్రతిపాదనలను విడివిడిగా పంపారు. దీంతో కేంద్ర వన్యప్రాణి సంరక్షణ శాఖ, నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ ఈ ప్రపోజల్స్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. ఈ గ్రామాలకు సంబంధించి సబ్ స్టేషన్ ఫీడర్ ఛానల్ పరిధిలోకి వచ్చే గ్రామాలను కలిపి ప్రతిపాదనలు రూపొందించాలని పలుమార్లు కేంద్ర అటవీ పర్యావరణ, వైల్డ్ లైఫ్ బోర్డు అధికారులు సూచించారు. అయితే అటవీశాఖ అధికారులు మాత్రం పాత ప్రతిపాదనలకే ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్సవరించింది. కరెంట్సౌకర్యం కోసం సేకరించే అటవీ భూమికి బదులుగా నాన్ ఫారెస్ట్ ల్యాండ్ ను మరోచోట కేటాయించాలని రూల్విధించారు.
మారిన ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్ ప్రకారం తాజా ప్రతిపాదనలు రూపొందించి పంపాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దీంతో అటవీశాఖ, ఎన్పీడీసీఎల్అధికారులు క్షేత్రస్థాయిలో సబ్ స్టేషన్ ఫీడర్ ఛానల్ పరిధిలో ఉన్న గ్రామాలను ఓ యూనిట్‌గా రూపొందించి అందుకు అనుగుణంగా తాజా ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. దీంతో పాటు నాన్ ఫారెస్ట్ ల్యాండ్ ను కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు కేటాయించేందుకు భూసేకరణ చేస్తున్నారు. ఇలా నిర్మల్ జిల్లాలో 35 ఆవాసాలకు గానూ 5 ప్రతిపాదనలు పంపనున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 34, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 84, మంచిర్యాల జిల్లాలో 9 ఆవాసాలకు సంబంధించిన ప్రతిపాదనలను సైతం రీ ప్రపోజల్ చేయనున్నారు.
మొదలైన జాయింట్ సర్వే..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని త్రీఫేజ్కరెంట్ సౌకర్యం లేని 162 గ్రామాల్లో తాజా అటవీ అనుమతుల విధానానికి అనుగుణంగా సర్వే మొదలైంది. కొత్త ప్రతిపాదనల రూపకల్పనకు సంబంధించి పీసీసీఎఫ్, సీడబ్ల్యూఎల్, డబ్ల్యూఆర్ఎమ్, పీసీసీఎఫ్ సీఏ అధికారులు ఎన్పీడీసీఎల్ డైరె క్టర్ తో సమావేశమై గైడ్లైన్స్రూపొందించారు. దీనికి అనుగుణంగా ఈ గిరిజన గ్రామాల్లో జాయింట్ సర్వే పనులను మొదలుపెట్టారు. మరో వారం రోజుల్లో ఈ సర్వే పూర్తికాగానే అధికారులు ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపనున్నారు.
ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం..
కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించిన అటవీ అనుమతుల విధానాన్ని అనుసరించి ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. తాజాగా సవరించిన అటవీ అనుమతుల విధానానికి అనుగుణంగా అటవీ భూమికి సమానమైన నాన్ ఫారెస్ట్ ల్యాండ్ కేటాయింపులు ఉండేలా ప్రపోజల్స్తయారు చేస్తున్నాం. రెండు రోజులుగా జిల్లాలో అటవీ, విద్యుత్ శాఖ అధికారులు సర్వే చేస్తున్నారు. సబ్ స్టేషన్ ఫీడర్ ఛానల్ ప్రకారం గ్రామాలను కలిపి ప్రతిపాదనల సంఖ్యను తగ్గిస్తున్నాం. ఈ ప్రతిపాదనలకు అనుమతులు రాగానే త్రీఫేజ్విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం.
– డాక్టర్ సునీల్ హిరామత్, డీఎఫ్ వో, నిర్మల్