మాదాపూర్, వెలుగు: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి బ్రిడ్జిపై వెహికల్స్ఆపడం, రీల్స్చేయడం, ఫొటోలు దిగడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మాదాపూర్డీసీపీ డా.వినీత్హెచ్చరించారు. ఇటీవల కేబుల్ బ్రిడ్జిపై నుంచి చెరువులోకి దూకి సూసైడ్చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. అలాగే కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతూ.. రీల్స్ చేస్తూ చాలా మంది ప్రమాదాల బారిన పడ్డారు. దీంతో సైబరాబాద్పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.