దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీటుక్కుతోంది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారానికి రంగంసిద్దం చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించారు కూడా.. దీంతో ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతుండగా.. ఎన్నికల కమిషన్ బాంబు పేల్చింది. 2024 ఎన్నికలకు ప్రచారం నిర్వహించే అభ్యర్థులు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఏ పార్టీకి చెందిన అభ్యర్థులైనా ప్రచారాలకు సంబంధించి 48 గంటల ముందు సువిధ అనే యాప్‌లో అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న 24 గంటల్లోనే అనుమతి వస్తుంది.
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచార వేడి కనిపిస్తుంది. పోలింగ్‌కి ఇంకా 40 రోజులుపైనే టైం ఉన్నపటికీ రాజకీయ పార్టీలు ప్రచారంలో తగ్గేదెలే అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ప్రచారంలో ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఎన్నికలకు ముందు మరో ఎత్తు అనేలా ఎన్నికల కమిషన్ ప్రచారంలో తొలిసారిగా ఆంక్షలు పెట్టింది. ప్రచారాలకు సంబంధించి సమాచారం ముందుగా ఇవ్వాలని కొత్త యాప్ రూపొందించింది. ఏ పార్టీకి చెందిన అభ్యర్థులైనా ప్రచారాలకు సంబంధించి 48 గంటల ముందు సువిధ అనే యాప్‌లో అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న 24 గంటల్లోనే అనుమతి వస్తుంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారం కోసం అధికారుల నుంచి వేగంగా, ఎటువంటి వ్యయ ప్రయాసలు లేకుండా అనుమతులు పొందేందుకు భారత ఎన్నికల సంఘం సువిధ సింగిల్ విండో యాప్‌ను ప్రవేశపెట్టింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ర్యాలీలు, ఊరేగింపులు వంటివి నిర్వహించే పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల సంఘం అనుమతిని తీసుకునేందుకు సువిధ యాప్‌ను వినియోగించుకోవచ్చు. అభ్యర్థులు 48 గంటలకు ముందు దరఖాస్తులు చేసుకుంటే, 24 గంటల్లోనే అధికారులు అనుమతులు జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీల నుండి పోటీ చేసే అభ్యర్థులు అనుమతుల కోసం సువిధ యాప్ సింగిల్ విండో పద్దతిలో దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో గానేఅనుమతులను అధికారులు మంజూరు చేస్తున్నారు.
మీటింగ్, ర్యాలీలు, వాహనాలు, తాత్కాలిక ఎలక్షన్ ఆఫీస్, లౌడ్ స్పీకర్, హెలికాప్టర్, హెలిప్యాడ్, డోర్ టు డోర్ ప్రచారం, డిస్ ప్లే బ్యానర్స్, ఫ్లాగ్స్, ఎయిర్ బెలూన్స్, హోర్డింగులు, బ్యానర్లు, వీడియో వ్యాన్ మొదలైన అనుమతులు పొందేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా సువిధ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునేలా ఇచ్చే ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. అలాగే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల వద్దనే అనుమతి తీసుకునేందుకు వీలుగా కూడా సువిధ కౌంటర్‌ను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ ప్రచార అనుమతుల కోసం సువిధ ఆన్లైన్ పోర్టల్‌లో దరఖాస్తులు చేసుకుని వేగంగా అనుమతులు పొంది, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో అన్ని విధాల జిల్లా యంత్రాంగానికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.