కోఆపరేటివ్ బ్యాంకులకు కొత్త రూల్స్

కోఆపరేటివ్ బ్యాంకులకు కొత్త రూల్స్

ఆర్​బీఐ చేతికి మరింత కంట్రోల్​
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌‌లో సవరణలు
కేంద్ర కేబినెట్‌‌లో నిర్ణయాలు

న్యూఢిల్లీ: డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కోఆపరేటివ్ బ్యాంక్‌‌లను బలోపేతం చేసేందుకు, పీఎంసీ బ్యాంక్‌‌ లాంటి కుంభకోణాలను అరికట్టేందుకు.. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌‌లో సవరణలకు కేంద్ర కేబినెట్‌‌ బుధవారం ఆమోదముద్ర వేసింది. దేశంలో 1,540 కోఆపరేటివ్ బ్యాంక్‌‌లుండగా.. వీటిలో 8.60 కోట్ల మంది డిపాజిటర్లున్నారు. వీరి మొత్తం సేవింగ్స్‌‌ రూ.5 లక్షల కోట్లు ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదిత సవరణలు  కోఆపరేటివ్ బ్యాంక్స్‌‌ కోసం గైడ్‌‌లైన్స్‌‌ తెచ్చేందుకు ఆర్‌‌బీఐకి  ఉపయోగపడతాయి. కో–ఆపరేటివ్‌‌ బ్యాంకుల అడ్మినిస్ట్రేటివ్ సమస్యలను మాత్రం రిజిస్ట్రార్‌‌ ఆఫ్ కో–ఆపరేటివ్‌‌ పరిధిలోనే ఉంచుతున్నట్లు ఇన్‌‌ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌‌కాస్టింగ్ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ఈ సవరణలతో కో–ఆపరేటివ్‌‌ బ్యాంకులను  ఆర్థికంగా  బలోపేతం చేయొచ్చని చెప్పారు. కోఆపరేటివ్ బ్యాంక్‌‌లకు సీఈవోల అర్హతను ముందుగానే నిర్ణయించి… వీరిని  నియమించేటప్పుడు.. ఆర్‌‌‌‌బీఐ పర్మినిషన్‌‌ తీసుకునేలా సవరణలు చేశారు. ఆర్‌‌‌‌బీఐ గైడ్‌‌లైన్స్ ప్రకారం ఆడిట్ జరగాల్సి ఉంటుంది. ఏదైనా కోఆపరేటివ్ బ్యాంక్‌‌ సమస్యలో ఉంటే.. ఆ బ్యాంక్ బోర్డును ఆర్‌‌‌‌బీఐ రద్దు చేసే అవకాశం ఉంటుందని ప్రకాశ్ చెప్పారు. ఆర్‌‌‌‌బీఐ గైడ్‌‌లైన్స్‌‌లోకి మారేందుకు కోఆపరేటివ్ బ్యాంక్‌‌లకు సమయాన్ని ఇస్తున్నట్టు తెలిపారు.

బడ్జెట్‌‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలకు అనుగుణంగా కేబినెట్ నిర్ణయాలను ప్రకటించారు. కోఆపరేటివ్ బ్యాంక్‌‌లను బలోపేతం చేసేందుకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌‌లో సవరణలు తేవాలని బడ్జెట్‌‌లో నిర్మలా సీతారామన్‌‌ చెప్పారు.  క్యాపిటల్ అందుబాటులోకి వచ్చేలా చొరవ తీసుకోవాలని,  కో–ఆపరేటివ్‌‌ బ్యాంకుల గవర్నెన్స్‌‌ను మెరుగుపర్చాలని  నిర్మలా పేర్కొన్నారు. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్ స్కామ్‌‌తో… చాలా మంది కస్టమర్లు ప్రభావితమయ్యారు. ఈ బ్యాంక్‌‌ నుంచి మనీ విత్‌‌డ్రాయల్స్‌‌పై ఆంక్షలు విధించడంతో, చాలా మంది తమ మనీని తాము తీసుకోలేకపోయారు. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు వారం వ్యవధిలో ప్రభుత్వం తీసుకున్న చర్యలలో  ఇది రెండవదని ప్రకాశ్​ అన్నారు.

పీఎంసీ బ్యాంక్ బ్రాంచ్‌‌లను కలుపుకుంటాం…

పీఎంసీ బ్యంక్ బ్రాంచ్‌‌లను తాము కలుపుకుంటామని మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్(ఎంఎస్‌‌సీ) బ్యాంక్‌‌ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌కు లేఖ రాసింది. బ్యాంక్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. బ్రాంచ్‌‌లను కలుపుకునే ప్రతిపాదనను తీసుకొచ్చింది ఎంఎస్‌‌సీ బ్యాంక్. మహారాష్ట్రలోని  కోఆపరేటివ్స్‌‌కు ఎంఎస్‌‌సీ బ్యాంక్ అపెక్స్ బ్యాంక్‌‌ అని ఛైర్మన్ విద్యాధర్ అనాస్కర్ చెప్పారు.

మరిన్ని వార్తలు

కరోనా ఎఫెక్ట్: భారత్ లో మూతపడుతున్న చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు
కొత్త కార్లతో జిల్‌‌జిగేల్…
ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేనేజర్ తో లేనని చెప్పించా
లాస్ ఏంజిలిస్​లో మోసగాళ్లు
తెలంగాణ నుంచే ‘టాటా’కు ఎక్కువ ఆదాయం