హైదరాబాద్లో కార్లు అద్దెకు తీసుకుని అమ్మేస్తున్నారు

హైదరాబాద్ సిటీలోఇప్పుడు సరికొత్త మోసం బయటపడింది. కార్లు అద్దెకు తీసుకుని.. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో వాటిని అమ్మేస్తున్న ముఠా పట్టుబడింది. కొన్నా ళ్లుగా ఈ ముఠా లాంగ్ డ్రైవ్ యాప్ ద్వారా కార్లు అద్దెకు తీసుకుంటున్నారు..ఆ తర్వాత వీటిని తాకట్టుపెట్టడం లేదా అమ్మేయటం చేస్తున్నారు. పలువురు కారు యజ మానుల నుంచి వచ్చిన కంప్లయింట్స్ ఆధారంగా తీగ లాగితే డొంక కదిలినట్లు చెబుతున్నారు పోలీసులు.పూర్తి వివరాల్లోకి వెళితే..

లాంగ్ డ్రైవ్ పేరుతో కార్లను అద్దెకు తీసుకొని అమ్ముకుంటున్నా ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులనుంచి కోటి రూపాయల విలువైన ఆరు కార్ల ను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు హరీష్ కుమార్ మరో ముగ్గురితో కలిసి లాంగ్ డ్రైవ్ పేరుతో ఖరీదైన కార్లను అద్దెకు తీసుకుంటారు. కోమాళేశ్వర్, ప్రేమ్ కుమార్, అభిషేక్ అనే ముగ్గురు వ్యక్తులు  హరీష్ కుమార్ కు కమిషన్లపై కార్లను అప్పగిస్తారు. ఇందుకు  30 వేలనుంచి 40 వేల రూపాయలను కమిషన్ తీసుకుంటారు. 

హరీష్ కుమార్ కార్లను హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు తరలించి..అక్కడ వాటిపై వ్యక్తి గత లోన్లు తీసుకుంటారు..ఇలా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటా డు. వలపన్ని హరీష్ కుమార్ ను పట్టుకున్న పోలీసులు.. అతని నుంచి కోటి రూపాయల విలువైన 6 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.