
నిరుద్యోగుల కోసం కొత్త స్కీంను అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. 5 లక్షల మంది కోసం రూ.6 వేల కోట్లతో పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు భట్టీ.
సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ కోసం ఈ కొత్త స్కీం ను తీసుకొస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. మార్చి 15 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. నిరుద్యోగుల అర్హతను బట్టి 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తామని అన్నారు.
ALSO READ | మాది ఫామ్‌హౌస్‌లో పడుకునే ప్రభుత్వం కాదు.. ప్రజా ప్రభుత్వం: మంత్రి పొంగులేటి
తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని డిప్యూటీ సీఎం అన్నారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని గుర్తు చేశారు. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ నుకూడా ప్రోత్సహించేందుకే ఈ కొత్త స్కీం తీసుకొస్తున్నట్లు తెలిపారు.
రూ.540 కోట్లతో ఐలమ్మ యూనివర్సిటీ నిర్మాణాలు పూర్తి చేస్తామని, అందులో భాగంగా మొదట 15.5 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు భట్టి. తమ ప్రభుత్వం కార్పోరేషన్ల ద్వారా నిరుద్యోగులకు, యువతకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తోందని, గత ప్రభుత్వం కార్పోరేషన్లను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.