
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూకాశ్మీర్ లో సాధారణస్థితి, భద్రతను తిరిగి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓ పక్కన టెర్రరిజంపై ఉక్కుపాదం మోపేందుకు సీరియస్ నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రప్రభుత్వం మరోవైపు జమ్మూకాశ్మీర్ లో సాధారణ పరిస్థితులను నొలకొల్పేందుకు చర్యలు చేపట్టింది.
జమ్మూకాశ్మీర్ లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో సెక్యూరిటీ బ్లాంకెట్ ఏర్పాటు చేస్తోంది. ఉగ్రదాడితో ఇప్పటికే జమ్మూకాశ్మీర్ లోని పర్యాటక ప్రాంతాలన్నీ టూరిస్టులు లేక బోసిపోయింది. స్థానికులకు ఉపాధిలేకుండా పోయింది.
Also Read : టూరిస్టులకోసం ..కాశ్మీర్ (కత్రా)నుంచి ఢిల్లీకి స్పెషల్ ట్రైన్
పర్యాటకుల లేక ఆటో, క్యాబ్, దుకాణాలు,హోటళ్లు అన్ని మూసివేశారు. ఈ క్రమంలో స్థానిక ప్రజలకు, పర్యాటకులకు సెక్యూరిటీని పెంచి భద్రత భరోసా ఇచ్చింది.