కొత్త స్మార్ట్ ఫోన్స్: కెమెరా స్పెషల్స్

కొత్త స్మార్ట్ ఫోన్స్: కెమెరా స్పెషల్స్

కొత్త స్మార్ట్ ఫోన్ కొనేముందు ఎక్కువ మంది ఆలోచిస్తు న్న ఫీచర్లలో కెమెరా ప్రధానమైంది. ఇప్పుడంతా ఎక్కువ మెగా పిక్సెల్స్​ కలిగిన కెమెరా ఫోన్లను కొనేందుకే ఆసక్తి చూపిస్తు న్నారు. అందుకే చాలా మొబైల్ సంస్థలు మంచి కెమెరాతో ఫోన్లు రూపొందించి విడుదల చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘రెడ్ మి నోట్ 7 ప్రో’ వంటి మిడ్ రేంజ్ ఫోన్ లో కూడా 48 ఎంపీ కెమెరా ఉంది. ఇక త్వరలో ఇదే తరహా కెమెరాతోనూ మరికొన్ని ఫోన్లు రానున్నాయి. కెమెరాతోపాటు మరిన్ని స్పెషల్స్​తో రానున్న మొబైల్స్​పై ఓ లుక్కేద్దాం.

సామ్ సంగ్ గెలాక్సీ ఏ 70 (32 ఎంపీ)…

ప్రస్తుతం ఇతర కంపెనీ ఫోన్ల నుంచి ఎదురవుతున్న పోటీ దృష్ట్ యా ‘సామ్ సంగ్’ కూడా కెమెరా పైన దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఈ నెల 26న విడుదల కానున్న ‘సామ్ సంగ్ గెలాక్సీ ఏ70’లో కెమెరా స్పెషల్ గా రూపొందించింది.

..6.7 అంగుళాల ఫుల్ హెచ్ డి స్క్రీన్ 6జీబీ ర్యామ్/128జీబీ మెమొరీ

..ట్రిపుల్ ప్రైమరీ కెమెరా (32+8+5 ఎంపీ)

..32 ఎంపీ ఫ్రంట్ కెమెరా

..4,500 ఎంఏహెచ్ బ్యాటరీ

..స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్

..ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్

..రేర్, ఫ్రంట్ కెమెరా రెండూ 32 ఎంపీ కలిగి ఉండటం దీని ప్రత్యేకత. ధర

..సుమారు ముప్పై ఒక్క వేల రూపాయలు ఉండొచ్చని అంచనా.

మేజు 16 ఎస్…

..మరో చైనా మొబైల్ సంస్థ ‘మేజు’ కూడా ఈ వారమే 48 ఎంపీ

..కెమెరాతో కూడిన ఫోన్ ను విడుదల చేయనుంది. ‘మేజు 16 ఎస్’

..పేరుతో రానున్న ఈ ఫోన్ మన దేశంలో వచ్చే నెలలో విడుదలయ్యే

..అవకాశం ఉంది. దీని ప్రధాన ఫీచర్లు.

..6.2 అంగుళాల హెచ్ డి స్క్రీన్

..8 జీబీ ర్యామ్/128 జీబీ మెమొరీ

..48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా

..ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్

..6540 ఎంఏహెచ్ బ్యాటరీ

..ధర సుమారు ముప్పై అయిదు వేల రూపాయలుగా ఉండే అవకాశం ఉంది.

రియల్ మి3 ప్రొ…

‘ఒప్పొ ’కు చెందిన కో బ్రాండ్ రియల్ మి ప్రతి నెలా ఏదో ఒక కొత్త మోడల్ ఫోన్ ను విడుదల చేస్తూ వస్తోంది.ఈ నెల 22న రియల్ మి3ప్రొను విడుదల చేయనుంది. దీని ఫీచర్లలో ప్రధానమైంది కెమెరానే. ఈ ఫోన్ స్పెషల్ ఫీచర్లు ఇవి.

..6.3 అంగుళాల స్క్రీన్, స్నాప్

..డ్రాగన్ 710 ప్రాసెసర్

..6 జీబీ ర్యామ్/ 64 జీబీ మెమొరీ

..3960 ఎంఏహెచ్ బ్యాటరీ

..48+5 ఎంపీ డ్యుయల్ ప్రైమరీకెమెరా

..16 ఎంపీ ఫ్రంట్ కెమెరా

..ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్ లాక్

పది నిమిషాలు చార్జ్ చేస్తే ఐదు గంటల టాక్ టైమ్ కెపాసిటీ కలిగి ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ‘రెడ్ మి నోట్ 7 ప్రో’ కి ఇది గట్టి పోటీ ఇస్తుంది. దీనిలాగే ‘రియల్ మి 3 ప్రో’కెమెరా కూడా 48+5 మెగా పిక్సెల్స్​ కలిగి ఉంది. ఫ్లాష్ సే ల్ లో ‘రెడ్ మి నోట్ 7 ప్రొ’ ఫోన్ దొరకని వాళ్లకు దాదాపు అవే ఫీచర్లున్న ఈ ఫోన్ మరో ఆప్షన్ అవుతుంది. ధర సుమారు పదిహేడు వేల రూపాయలు ఉండొచ్చని అంచనా.