
ఉద్యోగులకు పేపర్ లెస్ జీతాల చెల్లింపునకు ఖజానా శాఖ ప్రత్యేక పోర్టల్ ప్రారంభించింది. అందుకోసం కొత్త సాఫ్ట్వేర్ ప్రవేశపెట్టింది. దీనివల్ల ఉద్యోగులు,అధికారులు ప్రతి చిన్న విషయానికీ డిపార్టుమెంట్ హెడ్ ల వద్దకు వెళ్లి మొరపెట్టుకునే పరిస్థితి ఉండదు. ఏమున్నా అంతా ఆన్ లైన్ లో ట్రెజరీ శాఖనే సంప్రదించాల్సి ఉంటుం ది. ‘పేపర్ లెస్ ’ జీతాల చెల్లింపు అన్ని ప్రభుత్వ శాఖలకు వర్తింపచేసేలా ఖజానా శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఉద్యోగుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ లో అప్ లోడ్ చేసే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఆయా శాఖల పరిధిలోని అధికారులు, ఉద్యోగుల వివరాలను ముందుగా ఆన్ లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి వ్యక్తిగత వేతనాలను నేరుగా వారి ఖాతాలకు జమయ్యేలా ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తారు. ఇప్పటివరకు ఖజనా కార్యాలయాల్లో ఉన్న సాఫ్ట్వేర్ ఓల్డ్ మోడల్. దీని ద్వారా ఉద్యోగి వేతనాలు, ఇతర బిల్లులు ఆన్ లైన్ లో నమోదు చేసి, వాటికి సంబంధించిన హార్డ్ కాపీలను డీడీవోల ధ్రువీకరణతో ట్రెజరీలో ఇవ్వాలి . దీనివల్ల అనేక ఇబ్బందులేగాక, అధిక పనిభారం కూడా ఉంటోంది. కొత్త విధానం ద్వారా ఇక అలాంటి ఇబ్బందులేవీ ఉండవు.
పొందుపర్చాల్సిన వివరాలివే….
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ తోపాటు సిర్పూర్ ఉప ఖజానా కార్యాలయాలు ఉన్నాయి.సిర్పూర్ (టి) ఉప ఖజానా కార్యాలయం పరిధిలో సిర్పూర్ (టి), కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్, పెంచి కలపేట మండలాలుండగా ఇక్కడి నుంచి 600 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 250 మంది సిబ్బంది పింఛన్లు పొందుతున్నారు. కాగజ్ నగర్ ఎస్టీవో కార్యాలయం పరిధిలో కాగజ్ నగర్ , దహెగాంమండలాలుండగా సుమారు 700 మంది ఉద్యోగులు, పింఛనుదారులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు వేతనం పొందడానికి ముందుగా ఆన్ లైన్ ఇంటి గ్రేటెడ్ ఫైనాన్స్మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో వారి వ్యక్తిగత వివరాలు పొందుపర్చాలి. బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి. ఇవి అప్ లోడ్ చేసిన తర్వాత ఉద్యోగికి ప్రత్యేకంగా పాస్ వర్డ్, యూజర్ ఐడీని ఖజానాశాఖ కేటాయిస్తుంది. ఇది సక్సెస్ అయిన వెంటనే ఇక ప్రతినెలా ఈ–కుబేర్ ద్వారా నేరుగా జీతాలు ఖాతాలో జమవుతాయి. ఈ నెల నుంచే ఇది అమలవుతుంది. అంటే మే ఒకటో తేదీ నుంచే ఈ విధానం ద్వారా జీతాలు చెల్లిస్తా రు. ఇప్పటికే ఆయా కార్యాలయాల అధికారులు ఉద్యోగుల వివరాలను కొత్త సాఫ్ట్ వేర్ లో పొందుపరుస్తున్నారు. కిందిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞా నంపై పూర్తిస్థాయి అవగాహన ఉండకపోవచ్చు. ముందుగా అవగాహన కల్పిస్తే బాగుండునన్న అభిప్రాయాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి.