రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో వేగం పెంచిన మేకర్స్ బుధవారం ‘సితార్’ అనే పాటను విడుదల చేశారు. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ రొమాంటిక్ సాంగ్‌ను సాకేత్ కొమండూరి, సమీర భరద్వాజ్ పాడారు. ‘‘చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మా.. బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా.. జట్టు కట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా.. గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా” అంటూ సాహితి రాసిన లిరిక్స్ ఇంప్రెస్ చేశాయి.
గతంలో హరీష్ శంకర్ డైరెక్షన్‌లో కెవ్వు కేక, అస్మైక యోగ లాంటి రెండు చార్ట్‌బస్టర్స్ ఇచ్చిన లిరిక్ రైటర్ సాహితి.. మరోసారి తనదైన శైలి సాహిత్యంతో ఆకట్టుకున్నారు. ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన డ్యాన్స్ మూమెంట్స్, రవితేజ స్టైలిష్ లుక్, భాగ్యశ్రీ బోర్సే గ్లామర్.. ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చాయి. కాశ్మీర్ లోయలోని అందమైన లొకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.