![Shakunthalam: అమ్మ పాటను రిలీజ్ చేసిన శాకుంతలం టీం](https://static.v6velugu.com/uploads/2023/02/new-song-relesed-by-shakunthalam-movie_aDjYlVkvhT.jpg)
సమంత ప్రధానపాత్రలో రూపొందుతున్న చిత్రం ‘శాకుంతలం’. ఫిబ్రవరి 17న సినిమా విడుదల కానుండటంతో ప్రమోషన్‌లో స్పీడు పెంచిన టీమ్, బుధవారం ‘యేలేలో యేలేలో’ అనే పాటను రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ని పాడాడు. జీ సరిగమప లోని సింగర్స్ కి చరణ్, సుధాన్షు లకు ఈ పాటకు బ్రాగ్రౌండ్ అందించే అవకాశం దక్కింది.
‘యేలేలో యేలేలో.. సీరే కట్టుకొచ్చిందే సందామామా.. అమ్మే తానే అయ్యేవేళా.. అందాలే సిందే బాలా అంటూ’ చైతన్య ప్రసాద్ రాసిన లిరిక్స్ ఇంప్రెస్ చేశాయి. తల్లి కాబోతున్న శకుంతలను తన పడవలో తీసుకెళ్తూ పడవ నడిపే వ్యక్తి (ప్రకాష్ రాజ్) పాడిన పాట ఇది. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా గుణ శేఖర్ ఈ ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు.