చంద్రుడిపై అనకున్నదానికంటే ఎక్కువ నీటి ఆనవాళ్లు

చంద్రుడిపై అనకున్నదానికంటే ఎక్కువ నీటి ఆనవాళ్లు

చంద్రునిపై మానవ మనుగడ సాధ్యమవుతుందా అని శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూ చంద్రుడిపైకి ఉపగ్రహాలు పంపిస్తున్నారు. ఖనిజ సంపద, నీటి ఆనవాలు, భూస్వరూలు లాంటి అంశాలను ఇప్పుడిప్పుడే సెంటిస్టులు కనుగొంటున్నారు. భారతదేశ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన ఒక అధ్యాయనంలో గతంలో అంచనా వేసిన దానికంటే ఎక్కువగా నీరు చంద్రుడిపై మంచు రూపంలో ఉందని తేలింది. చంద్రుని ఉపరితలం నుంచి లోతుకు వెళ్లేకొద్ధి నీటి పరిమాణం గడ్డ కట్టిన మంచు (ఐస్) ఉంది.

ఖగోళ శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే ఎక్కువగా మూన్ పోలార్ క్రెటర్లలో వాటర్ ఉందని ఆధారాలు లభ్యమైయ్యాయి. ISPRS జర్నల్ ఆఫ్ ఫొటోగ్రామెట్రీ అండ్ రిమోట్ సెన్సింగ్‌లో ఓ రీసెర్చ్ పబ్లిష్ అయింది. అందులో చంద్ర మండలం ఉపరితలంపై ఉన్న మంచు కంటే 2 మీటర్ల దిగువన ఉన్న మంచు 5 నుంచి 8 రెట్లు ఎక్కువని ఇస్రో బుధవారం తెలిపింది. ఈ నీటి వనరులు మనుషులు అక్కడ జీవించడానికి ఉపయోగపడుతాయాని ప్రయోగాలు జరుగుతున్నాయి. భవిషత్త్ లో చంద్రుడిపై ల్యాండ్ అయే శాటిలైట్స్ వెదర్ కండీషన్స్ అంచనా వేయడానికి కూడా ఈ ఆదారాలు ఉపయోగపడుతాయి.