టాటా ఆల్టోజ్ రేజర్ కారు లాంచ్..ధర, ఫీచర్స్ ఇవిగో

టాటా ఆల్టోజ్ రేజర్ కారు లాంచ్..ధర, ఫీచర్స్ ఇవిగో

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా మోటార్స్ స్పోర్టీ వెర్షన్ ఆల్ట్రోజ్ రేసర్ ఇండియా మార్కెట్లో విడుదలైంది. ప్రస్తుతం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.  టాటా ఆల్ట్రోజ్ ఆల్ఫా ఆర్కిటెక్చర్‌లో తయారు చేయబడిన మొదటి వెహికల్. 5 స్టార్ గ్లోబల్ NCAP అడల్ట్ సేఫ్టీ రేటింగ్‌తో భారతదేశపు అత్యంత సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్ ఇది. ALTROZ భద్రతలో మాత్రమే కాకుండా డిజైన్, టెక్నాలజీ, డ్రైవింగ్ డైనమిక్స్, కస్టమర్ డిలైట్‌లో కూడా #TheGoldStandardని సెట్ చేసింది. ఎల్లప్పుడూ ఉత్తమమైన కార్లను ఉత్పత్తి చేస్తామన్న కంపెనీ లక్ష్యాల్లో భాగంగా ALTROZ రేసర్‌ని పరిచయం చేసింది టాటా మోటార్స్. 

టాటా ఆల్ట్రోజ్ రేసర్ R1, R2, R3 అనే మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎంట్రీ లెవల్ R1 ధర రూ. 9.49 లక్షలు,మిడ్ వేరియంట్ R2 రూ.10.49 లక్షలు, ప్రీమియం R3 వేరియంట్ రూ. 10.99 లక్షలు. ఇవన్నీ ఎక్ష్ షోరూమ్ ధరలు. 

టాటా ఆల్ట్రోజ్ రేసర్  ఫీచర్లు: 

  • ALTROZ భద్రతలో భాగంగా ఇందులో 6 ఎయిర్ బ్యాగులు 
  • 10.25" టచ్‌స్క్రీన్ ఇన్ఫోమైట్ మెంట్ 
  • 7" TFT డిజిటల్ క్లస్టర్
  • షార్క్ ఫిన్ యాంటెన్నాతో వాయిస్ యాక్టివేటెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వెంటిలేషన్ సీట్లు
  • వైర్లెస్ ఛార్జర్
  • ఎరుపు, తెలుపు రేసింగ్ చారలతో లెథెరెట్ సీట్లు
  • R16 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్
  • ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు
  • LED DRLలు
  • వెనుక AC వెంట్లు
  • రేసర్ బ్యాడ్జింగ్  వంటి ప్రత్యేక ఫీచర్లు టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఉన్నాయి. 

ALTROZ రేసర్ ALTROZ పనితీరు నిదర్శనం. ఇది రేస్ కార్ లాంటి డిజైన్‌తో అద్బుతమైన అనుభూతిని కలిగిస్తుంది. వెలుపలి భాగంలో ఎరుపు, నలుపు రంగుల కలయిక ఏరోడైనమిక్, సొగసైన స్పోర్టీ స్టైల్ లో ఉంటుంది. 

టాటా ఆల్ట్రోజ్ రేసర్‌లో హుడ్ కింద 1.2-లీటర్, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో 120bhp, 170Nm టార్క్‌ను అందిస్తుంది. హ్యుందాయ్ i20 N లైన్ తో పోల్చి చూస్తే ఆల్ట్రోజ్ రేసర్ కంటే కేవలం 2Nm ఎక్కువ. హ్యుందాయ్ i20 N 1.0-లీటర్, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌, 120bhpని కూడా ఉత్పత్తి చేస్తుంది అయితే 172Nm వద్ద కొంచెం ఎక్కువ టార్క్‌ను అందిస్తుంది. 

టాటా ఆల్ట్రోజ్ రేసర్ 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు , వాయిస్ యాక్టివేటెడ్ సన్‌రూఫ్‌ వంటి కొత్త ఫీచర్లను పరిచయం చేసింది టాటా మోటార్స్. ఇది కొత్త ఆపరేటింగ్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో అప్‌గ్రేడ్ చేయబడిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 6-ఎయిర్‌బ్యాగ్‌లతో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వబడింది. రేసర్ ఎడిషన్.. ఇంటీరియర్ గేర్ లివర్, AC వెంట్లు, కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో కూడిన లెథెరెట్ సీట్లపై ఎరుపు రంగు యాక్సెంట్లతో అమర్చబడింది.