యూటీటీలో కొత్త జట్టు.. కోల్‌‌‌‌‌‌‌‌కతా థండర్‌‌‌‌‌‌‌‌బ్లేడ్స్

యూటీటీలో కొత్త జట్టు..  కోల్‌‌‌‌‌‌‌‌కతా థండర్‌‌‌‌‌‌‌‌బ్లేడ్స్

న్యూఢిల్లీ: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)లో కొత్త జట్టు చేరింది.  మెగా లీగ్‌‌‌‌‌‌‌‌ నుంచి పుణెరి పల్టన్ ఫ్రాంచైజీ వైదొలిగింది. దాని స్థానంలో కోల్‌‌‌‌‌‌‌‌కతా థండర్‌‌‌‌‌‌‌‌బ్లేడ్స్ అనే కొత్త ఫ్రాంచైజీచేరింది. 

మరోవైపు  పునిట్ బాలన్ గ్రూప్‌‌‌‌‌‌‌‌కు చెందిన బెంగళూరు స్మాషర్స్ తమ జట్టు పేరును పుణె జాగ్వర్స్‌‌‌‌‌‌‌‌గా మార్చుకుంది. 8 టీమ్స్ బరిలో నిలిచిన ఈ లీగ్  మే 29 నుంచి జూన్ 15 వరకు అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో జరగనుంది.