హైదరాబాద్, వెలుగు: డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్లో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్అనే కొత్త టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రారంభించింది. బీమా చేసిన వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. స్వయం ఉపాధి పొందేవారి కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు.
కస్టమర్ అవసరాలకు అనుగుణంగా పాలసీ టర్మ్‌ను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ కోసం చెల్లించిన ప్రీమియంలపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను తగ్గింపు పొందవచ్చు. ఈ ప్లాన్ రూ.10 లక్షల నుండి రూ. కోటి వరకు కవరేజీతో సమగ్ర రక్షణను అందిస్తుంది.
పాలసీ పొందే విధానం పూర్తిగా డిజిటల్పద్ధతిలో ఉంటుంది. ఈ టర్మ్ ప్లాన్15కుపైగా వెల్‌నెస్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది, వీటిలో ఉచిత టెలికన్సల్టేషన్‌లు, డయాగ్నోస్టిక్ పరీక్షలపై డిస్కౌంట్‌లు, మందుల డెలివరీ వంటివి ఉన్నాయని డిజిట్తెలిపింది.