
- ఎంఆర్‌జీఎఫ్‌యూఎస్‌తో అద్భుతమైన ఫలితాలు
- కిమ్స్‌లో ఇప్పటికే 8 మంది పేషెంట్లకు పూర్తిగా నయం
- రోగులకు అవగాహన కార్యక్రమంలో డాక్టర్ల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: చేతులు, కాళ్లు విపరీతంగా వణికిపోతూ.. మనమీద మనకే నియంత్రణ లేకుండా చేసే పార్కిన్సన్స్ డిసీజ్‌కు సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాధికి ఏడాది క్రితం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే శస్త్రచికిత్స మాత్రమే ఉండేది. ప్రస్తుతం వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ (ఎంఆర్‌జీఎఫ్‌యూఎస్) అనే ట్రీట్‌మెంట్ అందుబాటులోకి వచ్చింది.
దీని సహాయంతో కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లోనే వణుకుడు సమస్య పూర్తిగా తగ్గిపోతుందని కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు చెబుతున్నారు. గురువారం కిమ్స్‌లోని మూవ్‌మెంట్ డిజార్డర్స్ టీమ్ మానస్, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ గోపాల్ ఆధ్వర్యంలో పార్కిన్సన్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కోత అవసరం లేకుండా..
పార్కిన్సన్స్ వ్యాధికి గతంలో మెడిసిన్స్, డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలు ఉండేవని కిమ్స్ న్యూరోసర్జరీ విభాగాధిపతి, చీఫ్ న్యూరోసర్జన్ డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి తెలిపారు. ఇప్పుడు చిన్న కోత కూడా అవసరం లేకుండా ట్రీట్‌మెంట్ చేసే పద్ధతి అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. కేవలం ఎంఆర్ఐ యంత్రానికి మరో ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ మెషీన్‌ను అమర్చి 3, 4 గంటల పాటు ట్రీట్‌మెంట్ అందిస్తే, వణుకుడు రోగం పూర్తిగా తగ్గిపోతుందని తెలిపారు.
గతంలో డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సకు ఎంత ఖర్చు అవుతుందో.. దాదాపు దీనికి కూడా అంతే అవుతుందన్నారు. వణుకు సమస్య ఏ దశలో ఉన్నా ఈ చికిత్స చేయించుకోవచ్చని చెప్పారు. ఎంఆర్‌జీ ఎఫ్‌యూఎస్ ద్వారా కిమ్స్‌లో 8 మంది పేషెంట్లకు చికిత్స చేసి, సత్ఫలితాలు సాధించామని కిమ్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం.జయశ్రీ తెలిపారు.
పార్కిన్సన్స్ వ్యాధి వల్ల మెదడులో ప్రభావితమైన ప్రాంతాలను ఎంఆర్ఐ ద్వారా గుర్తించి, చికిత్స చేసేటప్పుడు తక్కువ హీట్‌తో టెంపరెరీ థర్మోఅబ్లేషన్ చేసి వణుకు తగ్గిందా లేదా అని చూస్తామన్నారు. తర్వాత ఎక్కువ హీట్‌తో పర్మినెంట్ థర్మోఅబ్లేషన్ ద్వారా పూర్తి చికిత్స చేస్తామని వెల్లడించారు. ఆ ప్రాసెస్‌లోనే వణుకు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పారు.