కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో మరో ట్విస్ట్.. ఆమె తమ్ముడు ఒక్కడే కాదంట..!

కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో మరో ట్విస్ట్.. ఆమె తమ్ముడు ఒక్కడే కాదంట..!

రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం రాయపోలులో జరిగిన కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నిందితుడు పరమేష్తో పాటు అతనికి అచ్చన శివ అనే మరో వ్యక్తి హత్యలో సహకరించినట్లు విచారణలో పోలీసులు తేల్చారు. శివ కోసం మూడు బృందాలుగా పోలీసులు వెతుకున్నారు. శివ ఇచ్చిన సమాచారంతో నాగమణిని వెంబడించి పరమేష్ హత్య చేసినట్లు విచారణలో తెలిసింది. 

2014లో నాగమణి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుని ఆ తర్వాత భర్తతో తెగతెంపులు చేసుకోవడంతో పాటు కులాంతర వివాహం చేసుకోవడం, భూ వివాదం హత్యకు కారణంగా పోలీసులు తెలిపారు.  నిందితుడు పరమేష్కు వైద్య పరీక్షలు పూర్తి చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. నిందితుడి దగ్గర నుంచి ఒక కత్తి, మహీంద్రా కారు, ఐ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

అసలేం జరిగిందంటే..
డ్యూటీకి వెళ్తున్న లేడీ కానిస్టేబుల్ను తోడబుట్టిన తమ్ముడే అతి కిరాతకంగా నరికి చంపాడు. ఆదివారం రాయపోల్కు వచ్చిన నాగమణి,  శ్రీకాంత్ను పరమేశ్​గమనించాడు. సోమవారం ఉదయం స్కూటీపై ఒంటరిగా నాగమణి డ్యూటీకి వెళ్తుండగా కారులో వెంబడించాడు. రాయపోల్, మాన్యగూడ మధ్య వెనుక నుంచి తన అక్కను కారుతో ఢీకొట్టాడు. అదుపు తప్పి రోడ్డుపై పడిపోయిన నాగమణిని వేట కొడవలితో నరికి చంపాడు. పరమేశ్​ వెంబడిస్తున్న టైంలో నాగమణి తన భర్త శ్రీకాంత్కు ఫోన్​చేసింది. తన తమ్ముడు వెంబడిస్తున్నాడని తెలిపింది. శ్రీకాంత్​వెళ్లేలోపే నాగమణి చనిపోయి రోడ్డుపై పడి ఉంది. 

ఈ ఘటనతో ఒక్కసారిగా రాయపోల్  ఉలిక్కిపడింది. నాగమణి భర్త శ్రీకాంత్ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ సత్యనారాయణ తెలిపారు. పోలీసులు ఘటనా స్థలంలో వేట కొడవలి, కారు బంపర్ తో సహా నంబర్ ప్లేట్, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. నాగమణి మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఘటనా స్థలాన్ని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి పరిశీలించారు.

ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్​ గ్రామానికి చెందిన కొంగర నాగమణి (27) హైదరాబాద్​ శివారులోని హయత్​నగర్​ పోలీస్​స్టేషన్లో కానిస్టేబుల్. ఆమె 2020లో ఉద్యోగంలో చేరింది. అప్పటి నుంచి హాస్టల్లోనే ఉంటున్నది. ఆమె తల్లిదండ్రులు 12 ఏండ్ల కిందనే అనారోగ్యంతో చనిపోగా.. నాగమణికి అక్క, తమ్ముడు పరమేశ్ (25 ) ఉన్నారు. అక్కకు పెండ్లి అయింది. 8 ఏండ్ల క్రితం నాగమణికి కూడా వివాహం జరగ్గా, 10 నెలల కింద విడాకులు తీసుకుంది. గత నెల 10న రాయపోల్ ​గ్రామానికి చెందిన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు బండారి శ్రీకాంత్ను పెండ్లి చేసుకుంది.

ALSO READ : అత్యంత కిరాతకం: పిల్లల ముందే మహిళా టీచర్‌పై కత్తితో దాడి.. భయంతో వణికిపోయిన విద్యార్థులు

అయితే ఈ వివాహం నాగమణి కుటుంబ సభ్యులకు, బంధువులకు ఇష్టం లేదు. దీంతో ఇటీవల గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. తమకు ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకున్న నాగమణికి ఆస్తిలో వాటా ఇచ్చేది లేదని చెప్పారు. మొదటి పెండ్లి టైంలో నాగమణికి ఇచ్చిన ఎకరా భూమిని కూడా పరమేశ్ తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అది కాకుండా భవిష్యత్తులో కూడా తల్లిదండ్రుల ఆస్తిలో ఎలాంటి హక్కు లేదని ఓ బాండ్​పేపర్ రాసివ్వాలని డిమాండ్​ చేశాడు. అందుకు నాగమణి నిరాకరించింది. కులాంతర వివాహం చేసుకోవడమే కాకుండా, బాండ్ పేపర్ రాసివ్వమంటే నిరాకరించిందని తమ్ముడు పరమేశ్​ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆ కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు.